తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కంటే సమర్థవంతంగా పని చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ వాదనలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్తామన్నారు. మిగులు జలాల వాడకం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేసి ఉంటే.. కృష్ణాజలాల్లో తెలంగాణకు పూర్తి వాటా దక్కేదని తెలిపారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలలో తెలంగాణ… ఏపీ లకు నీటి వాటా పంపిణీ చేయాలని.. ఫైనల్ ఆర్గ్యుమెంట్ దశకు చేరుకుందన్నారు. 811 టీఎంసీలలో తెలంగాణకి 575 టీఎంసీలు ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నట్లు తెలిపారు. పరివాహక, బేసిన్ జనాభా, సాగు అవసరాల గురించి వివరిస్తున్నామన్నార.
READ MORE: Operation Sindoor: పాకిస్తాన్‌ను బకరా చేసిన భారత్.. ఇలాంటి మోసం నేనెప్పుడూ చూడలేదు..
బీఆర్ఎస్ వాళ్ళు… బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకి 299 టీఎంసీలు చాలు అని వాదించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ కి 518 టీఎంసీలు ఇవ్వడానికి ఒప్పుకుందన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చాకా.. తెలంగాణకి ఎక్కువ టీఎంసీలు ఇవ్వాలని కోట్లాడుతున్నామన్నారు. 2020 జనవరిలో 34 శాతం తెలంగాణకి చాలు అని కేఆర్ఎంబీ ముందు లిఖిత పూర్వకంగా ఒప్పుకున్నది కేసీఆర్ ప్రభుత్వమని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ రోజు గోబెల్స్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. తెలంగాణకి అన్యాయం చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు మనం అన్యాయం చేస్తున్నామని ప్రచారం చేస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతి రోజు.. 1.09 టీఎంసీలు రాయలసీమ తరలించుకునేలా చేసుకుందన్నారు. ఇది బీర్ఆర్ఎస్ హయంలోనే జరిగిందన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీని ఏపీ పెంచిందని.. బీఆర్ఎస్ హయాంలోనే 92క్యూసెక్కులకు పెంచినట్లు తెలిపారు. 2020 జూన్ లో జగన్.. కేసీఆర్ భేటి అయ్యారని.. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రెండింతలు తరలించుకునేలా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందన్నారు. ఆగస్టు 2020లో అపెక్స్ కౌన్సిల్‌కి జగన్.. కేసీఆర్ పోయారన్నారు.
READ MORE: Hari Hara Veera Mallu : వీరమల్లు నుంచి ‘ఎవరది ఎవరది.. కొత్త పాట
“రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్.. అప్పటికే ఏపీ మొదలుపెట్టింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి.. టెండర్ల ప్రక్రియ కోసం కేసీఆర్ సహకరించారు. అపెక్స్ కమిటీ ముందు టెండర్ కంటే ముందే అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లలేదు. పాలమూరు వ్యక్తి కేసు వేశాక.. తెలంగాణ ప్రభుత్వం ఇంప్లేడ్ అయ్యింది. ప్రతిపక్ష నాయకుడు కల్వకుర్తి పంపులు స్టార్ట్ చేయలేదు అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 286 టీఎంసీలు మనం వాడుకున్నాం. బీఆర్ఎస్ హయంలో కూడా ఇంత కృష్ణా వాటర్ ఉపయోగించుకోలేదు. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు పెట్టినా దుర్వినియోగం అయ్యింది. బీఆర్ఎస్ పెండింగ్ ప్రాజెక్టులు పట్టించుకోక పోవడంతో తెలంగాణకి అన్యాయం జరిగింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలకు నేనే వెళ్తున్నా.. ఏపీ ఏం చెప్తుంది.. మన అడ్వకేట్లు వాదన ఎలా ఉంది అనేది నేనే పర్యవేక్షిస్తున్నా.. టెలీమెట్రి మిషన్లు కూడా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఎవరు ఎంత నీటి వినియోగం చేస్తుంది అనేది తెలుసుకోవడానికి టెలిమెట్రిక్ ఉండాలి. ఏపీ డబ్బులు ఇవ్వకపోయినా మనమే ఇచ్చి టెలిమెట్రిక్ ఏర్పాటు చేశాం. మేడిగడ్డ మనం అధికారంలోకి రాక ముందే కూలింది. తుమ్మిడిహెట్టి దగ్గర 38 వెల కోట్లలో కాంగ్రెస్ ప్రాజెక్టు మొదలుపెట్టింది. కొన్ని అప్రూవల్ వచ్చాయి. 11670 కోట్ల పనులు పూర్తి అయ్యాయి.. ప్రాజెక్టులో 33 శాతం పనులు పూర్తి అయ్యాయి. కేసీఆర్ సీఎం అయ్యాక… ప్రాణహిత చేవెళ్ల అద్భుత ప్రాజెక్టు.. దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా చేయండి అని కేంద్రానికి లేఖ రాశారు. ఇరిగేషన్ శాఖకి వచ్చే బడ్జెట్ లోనే.. అప్పులు కట్టాలి. గడిచిన ఏడాది16 వేల కోట్లు అప్పుల కోసం కట్టినం. పూర్తిస్థాయి రీ పేమెంట్ మొదలుకాలేదు. ప్రాజెక్టు పూర్తి ఐతే.. ఇంకా ఎంత కట్టాలో తేలుతుంది. ప్రాజెక్టు ఎక్కడ కట్టినా… నీళ్లు ఎల్లంపల్లి నిండు తేవాల్సిందే. నీటి సోర్స్ మేడిగడ్డ… అదే కూలిపోయిన తర్వాత… నీళ్లు ఎలా తెస్తాం. బీఆర్ఎస్ బేసిక్ ఆర్గ్యుమెంట్ తప్పు. మేడిగడ్డ కూలింది వాళ్ళ హయంలోనే. లీకేజీలు వాళ్ళ హయంలోనే.. మొదటి నుండి లీకేజీలో ఉంది. బీఆర్ఎస్ కనీసం రిపేరు కూడా చేయలేదు.” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.