హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా కల్తీ కల్లు సేవించి వాంతులు, విరోచనాలతో కూకట్‌పల్లి రాందేవ్ రావు ఆసుపత్రికి వచ్చే లోపే మౌనిక(25) అనే యువతి మృతి చెందింది. కానీ ముగ్గురు మాత్రమే మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. సీతారం, స్వరూప, మౌనిక మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. నారాయణమ్మ, బొజ్జయ్య అనే ఇద్దరు కూడా కల్తీ కల్లు తాగడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ.. వీళ్లు ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్లకుండా ఇంట్లోనే మృతి చెందారు. బొజ్జయ్య మృతదేహాన్ని వనపర్తి పంపారు. నారాయణమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈమె కల్లు తాగి చనిపోయింది అని వాళ్ళ అల్లుడు ఆరోపించారు.
READ MORE: Starlink: ఇక దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్.. స్టార్‌లింక్‌కు కీలక అనుమతులు..
కాగా.. హైదర్‌నగర్, కూకట్‌పల్లి, నడిగడ్డతండా, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది ఆదివారం ఉదయం కల్లు తాగారు. ఆ రోజు బాగున్నా.. సోమవారం ఉదయం నుంచి క్రమంగా బీపీ పడిపోవడం, కొందరు స్పృహ కోల్పోవడం, తీవ్ర విరేచనాలు, వాంతులు, అచేతనంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వీరిని హైదర్‌గూడ రాందేవ్‌రావ్ ఆసుపత్రిలో చేర్చారు. బాధితులకు ఆదివారం నుంచి మూత్రం రావడం లేదు. ఈ ప్రభావం కిడ్నీలపై పడి.. క్రియాటినైన్ స్థాయులు పెరుగుతున్నాయి. వారికి అత్యుత్తమ వైద్యంతోపాటు డయాలసిస్ చేసేందుకు నిమ్స్‌కు తరలించారు.
READ MORE: Health Tips: నరాల బలహీనత వేధిస్తోందా?.. ఆ విటమిన్ ఉండే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోండి!