సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఇది వరకు 44 మృతదేహాలు గుర్తించిన విషయం తెలిసిందే. లభించని ఆ 8 మంది విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో 8 మంది ఆచూకీ లభించడం కష్టమేనని నిర్ణయానికి వచ్చారు. రాహుల్, వెంకటేష్, శివాజీ, విజయ్, జస్టిన్, అఖిలేష్, రవి, ఇర్ఫాన్‌లు పూర్తిగా కాలి బూడిదైపోయి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆచూకీ లభించని ఆ 8 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇస్తామని బాధిత కుటుంబాలకు చెప్పారు. డీఎన్‌ఏ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.
READ MORE: Hyderabad: కల్తీ కల్లు తాగి మహిళ మృతి.. అంత్యక్రియలు ఆపిన పోలీసులు.. అసలేం జరిగింది..?
ప్రమాదంలో ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు తక్షణ పరిహారం ప్రకటించారు. ఒక్కొక్కరికి తక్షణ సహాయం కింద 15 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. 8 మంది ఆచూకి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే చెబుతామని అధికారులు స్పష్టం చేశారు. అప్పటి వరకు బాధిత కుటుంబాలు స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలు చివరి ఆచూకీ వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
READ MORE: Bombay High Court: భార్య వ్యభిచారం అనుమానంతో బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయలేం..