Shravan Masam 2025: తెలుగు పంచాంగం ప్రకారం.. గత రెండ్రోల కిందటే శ్రావణ మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ నెల మొత్తం అమ్మవారి దేవాలయాలు, శివుడు, శ్రీ హరి ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. శివ భక్తులు శివ మాల ధరించి, శివ భజన, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేకాదు వివాహిత మహిళలు వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శివయ్యకు శ్రావణ సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులందరూ ఉపవాసం ఉంటారు. శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి.. శివయ్యకు ఏ విధమైన పూజలు చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…
READ MORE: MS Dhoni: ధోని షర్ట్ ఐఫోన్ కంటే కాస్ట్లీ.. ధర ఎంతంటే?
సూర్యోదయానికి ముందే నిద్రలేచి…స్నానమాచరించి శివాలయాలను దర్శించుకోవాలి. శివుడికి పాలు లేదా గంగా నీళ్లతో అభిషేకం చేసి, బిల్వపత్రం, విభూది సమర్పించాలి. అనంతరం ఓం నమఃశివాయ అంటూ మంత్రాన్ని జపించాలి. మీకు తోచిన మేరకు పేదలకు దానం చేయాలి. ఇలా శ్రావణమాసంలో వచ్చే సోమవారం చేస్తే మంచిఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సోమవారం శివ భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని ఉపవాస దీక్షలతో స్వామివారి పూజలో పాల్గొంటారు. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం పరమేశ్వరుడికి పూజ చేయడం వల్ల జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. భక్తులు ఉపవాసంతో ఆలయాలకు వెళ్లి పరమేశ్వరుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే అభిషేక ప్రియుడు అయినటువంటి పరమశివుడికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మనకు ఆరోగ్యం సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
READ MORE: Chhangur Baba: హిందూ అమ్మాయిలను వలలో వేయడానికి 1000 మంది ముస్లిం యువకులకు నిధులు..
ఇలాంటి తప్పులు చేయొద్దు..
మత విశ్వాసాల ప్రకారం, కొబ్బరికాయను విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. శ్రావణ మాసం పూజలో శివుడికి కొబ్బరినీళ్లతో అభిషేకం చేయకూడదు. అలాగే శివారాధనలో కుంకుమ లేదా కుంకుమను ఉపయోగించకూడదని నమ్ముతారు. అందుకే వీటిని పూజలో వాడొద్దు. శ్రావణ మాసంలో మాంసం, ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే శివారాధనలో దానిని వాడకూడదు.మత విశ్వాసాల ప్రకారం, శివుడిని పూజించేటప్పుడు నల్లని దుస్తులు ధరించకూడదు.