ఈ నెల 8న పామర్రులో వైసీపీ సమావేశం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైసీపీ కార్యకర్తలను రప్పా రప్పా అని అనొద్దు అని చెప్పానన్నారు. అలా అనటం సంస్కారం కాదు అని చెప్పాను.. మన ఆస్తులను ధ్వంసం చేసి నిలువ నీడ లేని వారికి అట్టు పెడితే అట్టున్నర పెట్టాలని అన్నాను.. నేనెవరిని నరకమని చెప్పలేదన్నారు. 8న మాట్లాడితే నేను టీడీపీ ప్రభుత్వం తనపై కథనాలు వండి వార్చారని.. తాను ఏమీ అనకుండానే తల నరకాలని, చీకట్లో అన్నీ చేయాలని అన్నానని కథనాలు వేశారన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ జగన్ మాట్లాడిన వీడియోలు పేర్ని నాని ప్రదర్శించారు. జగన్ ను భూ స్థాపితం చేయటం చంద్రబాబు, లోకేష్ తరం కాదన్నారు. మహిళ పై దాడికి పాల్పడిన వాళ్లు సైకో లా మనం సైకోమా? అని ప్రశ్నించారు.
76 ఏళ్ల ముసలాయన 50 ఏళ్ల జగన్ ను భూ స్థాపితం చేస్తానని అంటున్నారని.. చంద్రబాబు, పవన్ లు బరితెగించి మాట్లాడొచ్చు అంటూ వీడియోలు ప్రదర్శించారు. ఎర్ర బుక్ తో అరాచకం చేస్తున్న లోకేష్ సైకోనా జగనా ? అని ప్రశ్‌నించారు.
READ MORE: Health Tips: వర్షాకాలం వ్యాధుల కాలం.. ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే.. ప్రమాదంలో పడ్డట్టే!
“మూడు నెలల్లో కొడాలి నాని గుడివాడ వస్తున్నాడు. ఆరోగ్యం బాగు చేసుకుని గుడివాడ వస్తున్న కొడాలి నానిని ఏం చేస్తారో చూద్దాం రండి. చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. నేను అనాలంటే పట్టపగలు వేసేయండి అనే చెబుతాను. కానీ నాకు నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అనలేదు.
బందరు మంత్రి బెజవాడ వెళ్ళి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. మహిళా జడ్పీ చైర్ పర్సన్ హరికపై కొల్లు రవీంద్ర దిక్కు మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. కొల్లు రవీంద్ర మంత్రి పదవిని చంద్రబాబు పీకటం ఖాయం. మొన్న క్యాబినెట్ లో ఇదే విషయాన్ని కొల్లు రవీంద్రకు చెప్పాడు. కొల్లు రవీంద్ర అన్నం తినకుండా మద్యం షాప్, బెల్ట్ షాపుల్లో వాటాలు తింటున్నాడు. కొల్లు రవీంద్ర అన్నం తినటం లేదు…దిక్కుమాలిన బ్రతుకు. పార్టీకి, మహా నాడుకి 2.50 కోట్లు విరాళం ఎక్కడ నుంచి ఇచ్చావ్. ఎన్నికల అఫిడవిట్ లో ఆదాయం కోటి రూపాయలు చూపించిన నీకు ఇన్ని కోట్లు ఎక్కడివి. రాబోయే రోజుల్లో కొల్లు రవీంద్ర ఏం చేశాడో ఆధారాలతో సహా చూపిస్తాను.” అని పేర్నినాని వ్యాఖ్యానించారు.
READ MORE: Honeymoon Murder Case: సోనమ్ రఘువంశీ కుటుంబం కీలక నిర్ణయం.. బాధిత కుటుంబానికి ఏం చేసిందంటే..!
https://www.youtube.com/watch?v=H68lsoktVH0