గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ యంత్రాలు అందజేశారు. 33మంది రైతులకు 80శాతం సబ్సిడీపై రూ.12లక్షల విలువైన గల వ్యవసాయ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు కులం ఉండదు… పార్టీ ఉండదు… రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. రైతులు పంటలు అమ్మకోవటానికి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా హాయ్ అని పెడితే అన్ని మీదగ్గరకే వస్తాయని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ద్వారా రైతులకు లబ్ధి చేకూరటమే కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం రైతులను కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతుల సంక్షేమం భరోసా కల్పించే విధంగా సేవలతో ముందుకు సాగుతున్నామన్నారు.
READ MORE: Jharkhand: ఏంటీ 800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగాయా..? ఏం కవరింగ్ భయ్యా..
“గత ప్రభుత్వంలో రైతుల పడ్డ కష్టాలు చూశాను. రైతులు పడుతున్న ఆవేదన తెలుసుకొని వారికి అండగా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది. రైతుల విషయంలో కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటి సారి రైతుల నుంచి 12వేల 800కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించి 24గంటల్లో నే రైతుల ఖాతాల్లో జమచేశాం. రైతులను ప్రతి ఒక్కరు గౌరవినల్సిన కనీస బాధ్యత కలిగి ఉండాలి. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర ద్వారా అండగా నిలబడ్డాం. త్వరలో అన్నదాత సుఖీభవ రైతులందరికీ ఇవ్వబోతున్నాం. ఆర్గానిక్ వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.” అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.