శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపేశారు. జలాశయం గేట్లు తెరవడంతో గత రెండు రోజులుగా క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీ ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉంది. రద్దీ దృష్ట్యా 15వ తేదీ నుంచి 18 వరకు ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత స్పర్శదర్శనం నిలిపేశారు. భక్తులందరూ మార్పును గమనించాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు.
READ MORE: Honeymoon Murder Case: సోనమ్ రఘువంశీ కుటుంబం కీలక నిర్ణయం.. బాధిత కుటుంబానికి ఏం చేసిందంటే..!
శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఏపీ, తెలగాణలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలానికి చేరుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇప్పటికే క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి గంటల తరబడి వేచి చూస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు దేవస్థానం అధికారులు నిరంతరం తాగునీరు, అల్పాహారం అందించారు.
READ MORE: Gottipati Ravi Kumar: ఏపీలో విద్యుత్తు ఛార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ.. ఏమన్నారంటే..?