విజయనగరం ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్ లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన మాట నిలుకోలేదని.. ప్రజా వ్యతిరేఖ పాలన సాగిస్తోందన్నారు.. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని.. ఓడ దాటక ముందు వాడ మల్లన్న.. ఓడ దాటిన తరువాత బోడి మల్లన్న అన్న చందంగా కూటమి ప్రభుత్వం తయారైందని విమర్శించారు.. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని తెలిపారు.. జగన్ మోహనరెడ్డి పెట్టిన పథకాలనే కొనసాగించి, అంతకంటే మంచి పథకాలను తీసుకొస్తామన్న కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు..
READ MORE: Mahavatar Narasimha: హోంబాలే ‘మహావతార్ నరసింహ’ తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంయుక్త వాగ్దానంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి మోసం చేశారని బొత్స సత్యనారాయణ అన్నారు.. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఏమైందని ప్రశ్నించారు. మోసం చేసేవాడు మోసగాడు,దగా చేసేవారిని దగా కోరు అనాలని.. సూపర్ సిక్స్ హామీలు పోయి, ఇప్పుడు పి4 మాయ డ్రామా ఆడుతున్నారన్నారు. రుణాలు పేరుతో మహిళలకు మోసం చేశారని.. చంద్రబాబు వంద అబద్దాలు చెపితే కొడుకు లోకేష్ రెండు వందలు అబద్దాలు చెపుతారని తీవ్ర విమర్శలు చేశారు.. పార్టీ మొత్తం మాయ, దగా తో నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారని.. విజయనగరం జిల్లాలో మామిడికి సరైన ధర లేకపోవడంపై చెట్టుకు వదిలేశారన్నారు. కోట్లరూపాయలు అప్పు తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. వంద కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెట్టలేరా? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండ కట్టెందుకే.. వైసీపీ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు.
READ MORE: Netanyahu: అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కొత్త ఎత్తుగడ! ఈ వారంలోనే ప్లాన్ అమలు