Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న నేతన్నల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్ అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగం అభివృద్ధికి, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, నేతన్న బతికితేనే చేనేత కళ బతుకుతుందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ, బతుకమ్మ చీరలు, వర్కర్ టు ఓనర్ వంటి పథకాలతో చేనేత రంగానికి ఊపిరి పోసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి హామీలను మరిచి, ఆ పథకాలన్నింటినీ నిలిపివేసి నేతన్నల జీవితాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన నేతన్నలు నేడు తమ బతుకుల కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మగ్గాలు మూగబోతున్నాయని, కార్మికుల్లో వలసలు, అప్పులు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి బట్ట నేసి ఇచ్చే చేతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా స్పందించి చేనేత రంగాన్ని తక్షణమే ఆదుకోవాలని, కార్మికులకు భరోసా కల్పిస్తూ చేనేత రంగానికి పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నేతన్నను కాపాడుకుందాం, చేనేతను బతికించుకుందాం అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..