Zomato: ఫుడ్ డెలివరీ రంగంలో పెద్ద మార్పులు మొదలయ్యాయి. ఆన్లైన్ ఆర్డర్లు చేసే కస్టమర్లు, ఆ ఆర్డర్‌లు తయారు చేసే రెస్టారెంట్లు, వాటిని డెలివర్ చేసే యాప్‌లు ఇప్పటి వరకు ఒక్కోటి ఒక్కో విధంగా పనిచేస్తూ వచ్చాయి. కానీ ఇటీవలి నిర్ణయాలతో ఈ వ్యవస్థ మొత్తం కొత్త దిశలోకి వెళ్తోంది. ముఖ్యంగా జొమాటో కస్టమర్ల ఫోన్ నంబర్లు రెస్టారెంట్లతో పంచుకోవాలని ఒప్పుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. రెస్టారెంట్లు చాలా ఏళ్లుగా తమకు కస్టమర్ల సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఎవరు తరచూ తమ దగ్గర ఆర్డర్ చేస్తున్నారో, వారి అభిరుచులు ఏంటో తెలుసుకోవాలంటే ఈ డేటా అవసరమని రెస్టారెంట్ల యజమానులు అంటున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కస్టమర్‌తో నేరుగా మాట్లాడటం సులువు అవుతుందని, మార్కెటింగ్ కూడా లక్ష్యంగా చేసుకుని చేయగలమని వాదిస్తున్నారు. NRAI కూడా పదేళ్లుగా ఇదే కోరుతూ ఫుడ్ డెలివరీ కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది.
READ MORE:Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో స్వర్ణంతో మెరిసిన మహిళా డీఎస్పీ.. ప్రముఖుల ప్రశంసలు..!
ఇక జొమాటో మాత్రం ఇప్పటి వరకు కస్టమర్ వివరాలను పూర్తిగా మాస్క్ చేసి చూపేది. ఆర్డర్ తీసుకునే రెస్టారెంట్‌కు పేరు, నంబర్ ఏవీ కనిపించేవి కాదు. ప్రైవసీ కోసమే ఈ విధానం అనుసరిస్తున్నామని కంపెనీలు చెబుతుండేవి. కానీ పోటీ పెరుగుతుండటంతో రాపిడో లాంటి కొత్త కంపెనీలు చాలా తక్కువ కమీషన్‌తో మార్కెట్లోకి వస్తుండటంతో పరిస్థితులు మారాయి. రెస్టారెంట్లు సైతం ఒప్పందాలకు ఒత్తిడి చేయడంతో చివరికి జొమాటో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రారంభించిన ప్రయోగంలో వినియోగదారులు ముందే అనుమతి ఇస్తే వారి ఫోన్ నంబర్ రెస్టారెంట్‌కు వెళ్లేలా జొమాటో కొత్త ఫీచర్ ప్రారంభించింది. ఇది ఆరంభమేని, భవిష్యత్తులో ఆర్డర్ హిస్టరీ, అభిరుచులు వంటి మరిన్ని డేటా కూడా షేర్ అయ్యే అవకాశం ఉందని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. ‘‘ప్రైవసీ భంగం’’ అంటున్నవాళ్లు ఒక వైపు.. చర్చ మొదలైంది. మొత్తం వ్యవహారం చూస్తే, ఫుడ్ ఆర్డర్ చేసే విధానంలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కస్టమర్ డేటా ఎవరి చేతుల్లోకి వెళ్తోంది? దాన్ని ఎలా వాడుతున్నారు? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
READ MORE: Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..