Sweet Corn for Diabetics: డయాబెటిస్ తో బాధపడే వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న దానిపై విభిన్న రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా కొన్ని ఆహారాలు డయాబెటిస్ స్ధాయిలను పెంచుతుండగా, మరికొన్ని ఆహారాలు డయాబెటిస్ స్థాయిలను నియంత్రిస్తున్నాయని నిపుణులు పలు అధ్యయనాల ద్వారా నిర్ధారించారు. షుగర్ వ్యాధి గ్రస్తులు స్వీట్ కార్న్ తినే విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. తీపి మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉండటంతోపాటు, పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
READ MORE: Besan for Pigmentation: శనగపిండి పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుందా..? సంచలన విషయాలు..
డయాబెటిస్ ఉన్నవారు మొక్కజొన్న తినవచ్చా?
ఈ ప్రశ్నకు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహ రోగులకు మొక్కజొన్న తొనొచ్చు. సరైన మార్గంలో తింటే.. అది మధుమేహ రోగులకు హానికరం కాదు. మొక్కజొన్నలో ఫైబర్, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లకు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్థులు తక్కువ పరిమణంలో తినాలి. స్వీట్ కార్న్ ను పరిమితంగా తీసుకోవటం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. తాజా మొక్కజొన్నను గ్రిల్ చేసి లేదా ఉడకబెట్టి తినవచ్చు. మీ సలాడ్‌లో కూడా దీన్ని చేర్చుకోవచ్చు. ఇలా తినడం వల్ల డయాబెటిక్ రోగులకు మంచి పోషకాలు అందుతాయి.
READ MORE: Naveen Chandra : హనీతో నవీన్ చంద్ర కొత్త ప్రయాణం ప్రారంభం ..!
మధుమేహ వ్యాధిగ్రస్థులకు, బియ్యం కంటే మొక్కజొన్న మంచి ఎంపిక. ఎందుకంటే ఇది అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఫైబర్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, శోషణను నెమ్మదిస్తుంది. స్వీట్ కార్న్ లో ఉండే ఫైటో కెమికల్స్ శరీరంలోని ఇన్సులిన్ పెరుగుదలను నియంత్రిస్తుంది. అదేక్రమంలో మొక్కజొన్నలో ఉండే ఆంథోసైనిన్స్ మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డయాబెటిస్ రోగులలో మూత్రపిండాల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం స్వీట్ కార్న్ తీసుకోవటం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.