హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. గుండె నొప్పితో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బత్తిని మనితేజ (17) గుండె నొప్పితో మృత్యుఒడికి చేరుకున్నాడు. మణితేజ స్వగ్రామం శాయంపేట మండలం ప్రగతి సింగారం.
READ MORE: Make In India : వింబుల్డన్ స్టార్లకు ఇష్టమైనవి ‘మేక్ ఇన్ ఇండియా’ టవళ్లే..! విదేశాల్లో భారత్ హవా..!
ఇదిలా ఉండగా.. ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. గుండెపోటు నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారి జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది ప్రతి యువకుడి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్నగా మారుతోంది. ఇందులో ప్రధాన కారణం రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించడం వల్ల గుండెపోటు కేసులు యువతలో తరచుగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
గుండెనొప్పి రావడానికి ప్రధాన కారణాలు మనందరికీ తెలిసినవే. పెద్దవారిలోనైనా, యువతలో అయినా.. ఒకేలా ఉంటాయి. తినే ఆహారంపై నియంత్రణ లేకపోవడం, శారీరక వ్యాయామం చేయకపోవడం, ఒత్తిళ్లు, ఆందోళనలు, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్ల వల్ల గుండెపోటు సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కలిసి మొదట్లో బరువు పెరగడానికి కారణం అవుతాయట. ఆపై మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యల్ని తెచ్చిపెట్టి చివరికది గుండె రక్తనాళాల్లో బ్లాకుల్ని తెచ్చిపెట్టే కరోనరి ఆటరీ డిసీస్‌కు దారి తీస్తాయట. ఒకవేళ యుక్త వయసులో గుండెపోటు వస్తే తొందరగా గుర్తించలేమట. లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా విరుచుకు పడి ప్రాణాంతంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే యుక్త వయస్కులు అందరూ కూడా 25 ఏళ్లు దాటాకా గుండె ఆరోగ్యాన్ని తెలిపే కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం.