What is Black Magic: చేతబడి ఆరోపణలపై హత్యలు చేయడం పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చేతబడి పేరుతో హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో తోడబుట్టిన వాళ్ళను హత్య చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నారు జనం. ఏదైనా రోగం వస్తే మంత్రాలతోనే వచ్చిందని నమ్ముతున్నారు.
చేతబడి అంటే ఏంటి?
అయితే.. చేతబడి అనేది ఒక మంత్రశక్తి అని.. మనుషుల గోర్లు, జుట్టు సేకరించి ఈ మంత్ర ప్రయోగం చేసి వారిని చిత్రహింసలకు గురిచేసి చంపుతారని ఓ విధానం బాగా ప్రచారంలో ఉంది. అయితే మంత్రతంత్రాలు అనేవి లేవని.. వాటి పేరుతో ప్రజలను మోసం చేయడమే కొందరు మోసగాళ్లు పనిగా పెట్టుకున్నారని అంటారు చాలా మంది హేతువాదులు. ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మకూడదని కూడా కొందరు అంటారు. చేతబడి అంటే ఇంగ్లీషులో విచ్ క్రాఫ్ట్ అని అర్థం. దీనినే వివిధ ప్రాంతాల్లో బాణామతి అని, చిల్లంగి అని కూడా అంటారు. చేతబడి అనేది ఓ మంత్రవిద్య అని.. శత్రువుల పై ప్రయోగించడానికి పూర్వం దీనిని ఉపయోగించేవారని పలు గ్రంథాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా అంతుచిక్కని అనారోగ్యం బారిన పడితే దానికి కారణం చేతబడే అని నమ్ముతారు. దాని నివారణ కోసం మంత్రగాళ్లను సంప్రదిస్తారు.
READ MORE: Health News: సమోసా, జిలేజీలకు కూడా ఇకపై “సిగరేట్-తరహా” వార్నింగ్స్..
తంత్ర శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో నష్టాలు చవిచూడటం, మానసిక ఒత్తిడి, భయం లేదా నిరాశ ఉంటే.. అది ప్రతికూల శక్తి ఉనికిని సూచిస్తుంది. చేతబడి చేసి ఉండవచ్చు. చేతబడి చేసిన వ్యక్తికి తనపై నియంత్రణ ఉండదని నమ్ముతారు. దీంతో వింతైన పనులు చేయడం ప్రారంభిస్తారు. ఇది తంత్ర శాస్త్రంలో ఉంది.
మూఢనమ్మకం..
ప్రభుత్వ వెబ్‌సైట్ Vikaspedia ప్రకారం.. చేతబడి, బాణామతి, మంత్రాలు వంటివి కల్పితాలు. మూఢనమ్మకాల వల్ల అనేక హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో 2000లో వరంగల్ జిల్లాలో ఐదుగురిని సజీవ దహనం చేశారు. శాస్త్రీయ దృక్పథం లేకపోవడం ఇలాంటి మూఢనమ్మకాలకు ప్రధాన కారణం. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా మాత్రమే ఈ మూఢనమ్మకాలను తొలగించవచ్చు. సైన్స్ పట్ల అవగాహన, హేతుబద్ధమైన ఆలోచన, అశాస్త్రీయ సాహిత్యం నివారణ అవసరం. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం, ప్రజలతో చర్చించడం, హేతుబద్ధమైన ఆలోచనను ప్రోత్సహించడం ద్వారా ఇలాంటి మూఢనమ్మకాలను తగ్గించవచ్చు.
NOTE: ‘ఈ వ్యాసంలో ఉన్న సమాచారం/కంటెంట్ పలు వెబ్‌సైట్ల ద్వారా సేకరించినది. ఇందులో ఖచ్చితత్వం లేదు. విశ్వసనీయత ఉంటుంది అనుకోలేము. ఈ సమాచారాన్ని వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగం/ప్రబోధాలు/నమ్మకాలు/మత గ్రంథాల నుంచి సేకరించినది. మా లక్ష్యం సమాచారాన్ని తెలియజేయడం మాత్రమే. ఉందా? లేదా? అని క్లారిటీగా చెప్పాలేం. సమాచారం అందించడం మా వంతు.. నమ్మడం, నమ్మక పోవడం మీ నిర్ణయం..