ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో రెండవ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం కూడా లోక్ సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చించారు. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు.. పహల్గాం ఉగ్రదాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించారు.. భార్య చూస్తుండగానే భర్తను కాల్చి చంపారని గుర్తు చేశారు.. పహల్గాం బాధితులను తాను స్వయంగా కలిశానని తెలిపారు.. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్రానికి ప్రతిపక్షాలు పూర్తి సహకారం అందించాయన్నారు.. ఆపరేషన్ సిందూర్‌కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాటిపై ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.. పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్థాన్ పనే అని నొక్కి చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన క్షణం నుంచి ప్రతిపక్షం భారత ప్రభుత్వం, బలగాలు మద్దతు ఇచ్చిందని.. కానీ ప్రభుత్వం సైన్యం చేతులు కట్టి ఉండకూడదని రాహుల్ గాంధీ అన్నారు. ‘సింహాన్ని స్వేచ్ఛగా వదిలేయాలి’ అని సైన్యాన్ని ఉద్దేశించి అన్నారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశామని తాము పాకిస్థాన్‌కు మధ్యాహ్నం 1.35 గంటలకు చెప్పామని రక్షణ మంత్రి సభలో చెప్పారని గుర్తు చేశారు. కేవలం 30 నిమిషాల్లో పాకిస్థాన్‌కు లొంగిపోయారని విమర్శించారు. ప్రభుత్వానికి పోరాడాలనే సంకల్పం లేదని ఇది స్పష్టం చేస్తుందన్నారు. ప్రభుత్వం పైలట్ల చేతులు, కాళ్ళు కట్టివేసిందని ఆరోపించారు.
READ MORE: Film Chamber : ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ వాదుల గొడవ..
“ఆపరేషన్ సిందూర్ 22 నిమిషాల్లో ముగిసిపోయింది.. అర్ధరాత్రి 1.25 గంటల సమయంలో సీజ్ ఫైర్ ప్రస్తావన వచ్చింది.. మోడీ ప్రభుత్వం సీజ్ ఫైర్‌పై పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చింది.. ఎయిర్ స్ట్రైక్‌కు ముందే పాకిస్థాన్‌కు మోడీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.. మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాకిస్థాన్‌ను అడిగింది.. మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ ముందు పూర్తిగా లొంగిపోయింది.. సైన్యం చేతులను ప్రభుత్వం కట్టేసింది. భారత ప్రభుత్వం తప్పు చేసింది. తప్పు సైన్యానిది కాదు. ప్రభుత్వానిది. యుద్ధం తానే ఆపినట్లు ట్రంప్ 29 సార్లు చెప్పారు. ప్రధానికి మోడీకి ధైర్యం ఉంటే ట్రంప్ చెప్పింది అబద్ధమని ఈ సభలో చెప్పాలి. ఇందిరా గాంధీ ధైర్యంలో 50 శాతం అయినా ఉంటే.. మోడీ ఈ విషయంపై మాట్లాడుతారు. ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే, డోనాల్డ్ ట్రంప్ ను తప్పుబడతారు.” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.