కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు ప్రసంగించారు. కేంద్రంపై తీవ్ర విమర్శలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్‌ను ప్రభుత్వం నిర్వహించిన తీరుపై పదునైన ప్రశ్నలను సంధించారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని సవాల్ విసిరారు. “డోనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపానని 29 సార్లు చెప్పారు. ఇది నిజం కాకపోతే.. ప్రధాని ట్రంప్ వ్యాఖ్యలను తిరస్కరించాలి. ఇందిరా గాంధీకి ఉన్న 50 శాతం ధైర్యంలో సగం అయినా మీకు ఉంటే.. సభలో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వండి.” అని రాహుల్ గాంధీ అన్నారు.
READ MORE: Gautam Gambhir: ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. పిచ్ క్యూరేటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్!
ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో లొంగిపోవాలని పాకిస్థాన్‌ను భారత్ డిమాండ్ చేసిందని, కేవలం 30 నిమిషాల్లోనే లొంగిపోయిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇండోనేషియాలో భారత రక్షణ శాఖ అధికారి కెప్టెన్ శివ కుమార్ చెప్పిన విషయాలను రాహుల్ గాంధీ ఉటంకించారు. “భారతదేశం కోల్పోయిన విమానాల సంఖ్యపై క్లారిటీ లేదు. కానీ మనం కొన్ని విమానాలను కోల్పోయాం. పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను లేదా సైనిక స్థావరాలను దాడి చేయవద్దని ప్రభుత్వ నేతలు సైన్యానికి స్పష్టంగా సూచించారు. పైలట్ల చేతులను కట్టేశారు.” అని శివకుమార్ మాటలను గుర్తు చేశారు.
READ MORE: Gautam Gambhir: ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. పిచ్ క్యూరేటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్!
రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగంలోని కొన్ని అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. “ఆపరేషన్ సిందూర్ తెల్లవారుజామున 1:05 గంటలకు ప్రారంభమైందని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ 22 నిమిషాలు కొనసాగిందని ఆయన అన్నారు. అంతలో షాకింగ్ విషయం చెప్పారు. 1:35 గంటలకు, తాము పాకిస్థాన్‌కు ఫోన్ చేసి కేవలం ఉగ్రస్థావరాలపైనే దాడి చేశామని చెప్పినట్లు తెలిపారు. ఉద్ధృతిని కోరుకోవడం లేదని పాకిస్థాన్‌కి తెలిపినట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన రోజు రాత్రి 1:35 గంటలకు భారత ప్రభుత్వం భారత డీజీఎంఓను కాల్పుల విరమణ కోరమని చెప్పింది.” అని రాహుల్ వ్యాఖ్యానించారు.