Heavy Rain Paralyzes Hyderabad: హైదరాబాద్‌ను వర్షం ముంచేసింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో వర్షం భారీ వర్షం పడింది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్ మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెం.మీ. వర్షపాతం.. ఖాజాగూడలో 12, ఎస్‌ఆర్ నగర్‌లో 11, శ్రీనగర్ కాలనీలో 11.1, ఖైరతాబాద్‌లో 10.09, యూసుఫ్‌గూడలో 10.4, ఉప్పల్‌లో 10, బంజారాహిల్స్‌లో 9, నాగోల్‌లో 8.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఒక వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు.. చాదర్‌ఘాట్ నుండి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది..
READ MORE: Radhika Apte : ప్రెగ్నెంట్ టైమ్ లో ఆ నిర్మాత ఇబ్బంది పెట్టాడు.. హీరోయిన్ ఎమోషనల్
రాయదుర్గం, బయోడైవర్సిటీ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. టోలిచౌకిలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జీడిమెట్ల, సుచిత్రలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాగారంలో గాలితో కూలితో భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బేగంబజార్, గౌలిగూడ బస్తీలలో వరదనీరు నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. కాగా.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 4 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది. హైదరాబాద్‌లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. హైదరాబాద్‌లో అర్ధరాత్రి 12లోపు మరోసారి వర్ష సూచన ఉందని తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
READ MORE: Hyderabad: హైదరాబాదులో భారీగా వర్షపాతం నమోదు.. ఆ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జాం..!