Hyderabad High Court: హైకోర్టులో ఒక్కసారిగా కుప్పకూలిన మరో లాయర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad High Court: హైకోర్టులో మరో లాయర్ ఒక్కసారిగా కుప్పకూలారు. కార్డియాక్ అరెస్ట్‌తో హైకోర్టు న్యాయవాది మృతి చెందారు. మృతుడిని ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన పరస అనంత నాగేశ్వరరావు (45)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. విధుల్లో భాగంగా నాగేశ్వరరావు నేడు హైదరాబాద్‌లోని హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆవరణలో కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చింది. గుండెపోటు రావడంతో కోర్టు ప్రాంగణంలోని కుప్పకూలారు. తోటి లాయర్లు, సిబ్బంది హుటాహుటిన స్పందించారు. ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితుడు ఒక్కసారిగా కుప్పకూలడం అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా.. నాగేశ్వరరావుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
READ MORE: LIC Reports Record Profit: పెరిగిన ప్రీమియం వసూళ్లు.. రూ.10,987 కోట్ల లాభంతో ఎల్ఐసీ రికార్డు
Also Read
ఇదిలా ఉండగా.. గతంలో హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే న్యాయవాది పసునూరు వేణుగోపాలరావు(66) గుండెపోటుతో కోర్టు హాలులోనే కుప్పకూలిపోయారు. భోజన విరామానికి ముందు 21వ కోర్టు హాలులో ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న న్యాయవాదులు వెంటనే ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. వేణుగోపాలరావు మృతితో 21వ కోర్టు హాలుతోపాటు ఇతర కోర్టుల్లోనూ న్యాయమూర్తులు అత్యవసర పిటిషన్‌లు మినహా ఇతర విచారణలను నిలిపివేశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వేణుగోపాలరావు వనస్థలిపురంలోని హిల్‌కాలనీలో నివాసం ఉండేవారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?