Trump Tariffs – Operation Sindoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరిపై అగ్రశ్రేణి నిపుణులు సైతం మండిపడుతున్నారు. ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్‌ను, అమెరికాకు ప్రథమ శత్రువుగా పరిగణించే చైనాను అకస్మాత్తుగా ట్రంప్ ఇష్టపడుతున్నారు. సుంకాల వివాదంలో చైనా కూడా భారతదేశానికి నైతిక మద్దతు ఇస్తుంటే.. ట్రంప్ మాత్రం మిత్రదేశం అంటూనే దెబ్బమీద దెబ్బ తీస్తున్నారు. భారత్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆపరేషన్ సిందూర్ అని ఓ విశ్లేషకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యాన్ని తిరస్కరించడంతో ఇందంతా చేస్తున్నారని.. అమెరికాకు చెందిన ఒక విశ్లేషకుడు అన్నారు.
గత రెండు దశాబ్దాలలో భారత వస్తువులపై అమెరికా అదనంగా 25% సుంకం (మొత్తం 50% సుంకం) విధించడం రెండు దేశాల మధ్య సంబంధాలలో ‘అత్యంత దారుణమైన సంక్షోభం’ అని వాషింగ్టన్‌కు చెందిన దక్షిణాసియా విశ్లేషకుడు, విదేశాంగ నిపుణుడు మైఖేల్ కుగెల్‌మన్ అన్నారు. కాల్పుల విరమణలో భారత్ దృఢమైన, స్వతంత్ర వైఖరిని ట్రంప్ తనకు జరిగిన వ్యక్తిగత అవమానంగా భావించారని.. దీంతో న్యూఢిల్లీపై చర్యలు తీసుకుంటున్నారని విల్సన్ సెంటర్‌లోని సౌత్ ఆసియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ మీడియా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అంటే భారత్ కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యం లేదని తెలపడం ట్రంప్‌కు నచ్చలేదు. దీంతో ఆయన సుంకాలను విధించారని మైఖేల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వాస్తవానికి… ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విరమణను ఒప్పుకుంది. కానీ ట్రంప్ చాలాసార్లు తాను మధ్యవర్తిత్వం వహించి భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని పేర్కొన్నారు. భారత్ మొదటి రోజు నుండే ట్రంప్ వాదనలను ఖండించింది. పాకిస్థాన్ డీజీఎంవో అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ చేపట్టామని.. విదేశాంగ మంత్రి నుంచి ప్రధాన మంత్రి వరకు అందరూ స్పష్టం చేశారు. ట్రంప్ పేరు చెప్పకుండానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ‘ప్రపంచంలోని ఏ నాయకుడూ ఆపరేషన్ సిందూర్ ఆపమని మమ్మల్ని అడగలేదు’ అని స్పష్టం చేశారు.
READ MORE: TCS Employees in Dilemma: గందరగోళంలో టీసీఎస్ ఉద్యోగులు.. జీతం పెంచినా.. ఉద్యోగ భద్రతపై భరోసా ఏది?