Vice President Election: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. వారికే ఆ అధికారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vice President Election: నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి వ్యూహంపై సమావేశంలో చర్చించారు. మీటింగ్ అనంతరం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం (ECI) ఉపరాష్ట్రపతి ఎన్నికల తేదీలను ప్రకటించిందని, నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21 అని ఆయన తెలియజేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధానమంత్రి మోడీ, జేపీ నడ్డా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అన్ని రాజ్యాంగ పార్టీల సీనియర్ నాయకులు హాజరయ్యారని రిజిజు తెలిపారు.
READ MORE: Komatireddy: ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ ధర్నాకు రాహుల్, ఖర్గే డుమ్మా.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
ఈ భేటీలో ఎన్డీఏ ఎంపీల మధ్య పరస్పర సమన్వయం, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది కాబట్టి.. ఎటువంటి విప్ జారీ చేయబడదన్నారు. అటువంటి పరిస్థితిలో ఏ ఒక్క అభ్యర్థి చెల్లని ఓటు వేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సాంకేతిక లోపం తలెత్తకుండా, అభ్యర్థులు కరెక్ట్‌గా ఓటు వేసేలా ఎన్డీఏ ఎంపీలకు ఓటింగ్ ప్రక్రియను రిహార్సల్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు వర్గాలు తెలిపారు.
READ MORE: MS Swaminathan Jayanti: ప్రజల ఆకలి తీర్చిన విజ్ఞాని.. ఎంఎస్ స్వామినాథన్ జయంతి స్పెషల్
ఇదిలా ఉండగా.. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు. ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయమే తమ నిర్ణయమని జనసేన ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని “జనసేన” అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని వెల్లడించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అంతిమ నిర్ణయం ప్రధాని మోడీకే విడిచిపెడుతున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు మాటగా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
-
Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!