AP Heavy Rains Holiday: ఏపీలోని పలు జిల్లా్ల్లో వర్షం దంచికొడుతోంది. అకాల వర్షానికి జనా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కారణంగా పాఠశాలలకు సెలవు ఇచ్చారు. ఇళ్లలోనే ఉండాలని తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్లు సూచించారు. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటూ.. విద్యుత్తు జోలికి పోవద్దని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటూ పలు హెచ్చరికలు జారీ చేశారు.
READ MORE: OnePlus Nord 5 vs Vivo V60: ప్రాసెసర్, డిస్ప్లే, డిజైన్ లో ప్రీమియం ఏది? ఎందుకు?
మరోవైపు.. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అతిభారీవర్షాలు కురుస్తుండటంతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి, డైరెక్టర్ ప్రఖర్ జైన్ , కోస్తా జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. “జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేయాలి. క్షేత్రస్థాయిలోని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వర్ష ప్రభావ ప్రాంతల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. NDRF, SDRF బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్,పడిన చెట్లను వెంటనే తొలగించాలి.” అని ఆమె అధికారులను ఆదేశించారు.