Vijayawada Lashed by Heavy Rains: బెజవాడను ముంచెత్తిన వర్షం ముంచెత్తింది. 2 గంటలుగా దంచికొడుతోంది. నిన్న రాత్రి, ఇవాళ సాయంత్రం బెజవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం తో నగరంలో ఉన్న ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. సింగ్ నగర్, వన్ టౌన్ వాసులు ఆందోళనలో ఉన్నారు. గత ఏడాది మాదిరి బుడమేరు పొంగుతుందని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బుడమేరు వల్ల ఇబ్బంది లేదని బుడమేరు ప్రవాహం నిలకడ గా ఉందని అధికారులు చెబుతున్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. నగరంలో ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
READ MORE: War 2: వార్ 2 సినిమా చూడ్డానికి 10 రీజన్స్!
ఇదిలా ఉండగా.. బుడమేరు అంశంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. “బుడమేరు విషయంలో అపోహలు నమ్మద్దు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ తెరవలేదు.. క్యాచ్మెంట్ ఏరియాల నుంచీ వచ్చే నీరు సముద్రంలోకి వదులుతున్నాం. అపోహలకు పోవద్దు… అలాంటి సమాచారం నమ్మద్దు.. డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశాం..” అని కలెక్టర్ స్పష్టం చేశారు.
READ MORE: Cloud Burst: కులులోని శ్రీఖండ్ మహాదేవ్ కొండపై క్లౌడ్ బ్రస్ట్.. హై అలర్ట్ జారీ!