KTR: బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్భందించడం రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమని తెలిపారు. పోడు రైతులను వేధించడం ఆపి, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని.. కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తో సహా బీఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కర్కశంగా విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గర్లోనే ఉందని ఫైర్ అయ్యారు.
READ MORE: Minister Anitha: రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని వ్యక్తి జగన్
దిందా పోడు రైతులను అరెస్ట్ చేసి తరలిస్తుండగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కాగజ్‌నగర్ నుంచి సిర్పూర్ టీకి తరలించారు. అక్కడి నుంచి కౌటాలకు తరలిస్తుండగా పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కౌటల వైపు తీసుకెళ్లినట్లు సమాచారం.
READ MORE: Pilli Subhash Chandra Bose: ఏజెంట్లు రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు..