Karnataka: పిలిచి పిల్లనిస్తే.. అత్తను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడైన అల్లుడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కోలాలలో జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఆమె శరీర భాగాలను ఖండఖండాలుగా నరికేశాడు దుర్మార్గుడు. అంతటితో ఆగకుండా పోలీసులకు దొరక వద్దనే ఉద్దేశ్యంతో వాటిని కవర్లలో ప్యాక్ చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. కానీ పాపం పండడంతో డాక్టర్ అల్లుడు దొరికేశాడు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కోలాలలో జరిగిన మహిళ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మహిళను మర్డర్ చేసింది అల్లుడు డాక్టర్ రామచంద్రప్పగా గుర్తించారు. హత్య అనంతరం ఆమె శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్లలో కుక్కేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు..
READ MORE: Adilabad: బైక్ లిఫ్ట్ అడిగిన లేడీ కిలాడీ.. ఆ వ్యక్తిని ముగ్గులోకి దింపి ఏం చేసిందో చూడండి..
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు డాక్టర్ రామచంద్రప్ప. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో డెంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి తుమకూరు జిల్లాలోని కోలాలకు చెందిన లక్ష్మి అనే మహిళ తన కూతురును ఇచ్చి వివాహం చేసింది. ఐతే రామచంద్రప్పకు గతంలో పెళ్లి అయింది కానీ.. మొదటి భార్యతో విభేదాలు ఉండడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఈ మధ్య అత్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో డాక్టర్ రామచంద్రప్ప విసిగిపోయాడు. అత్తను కడతేర్చేందుకు ప్లాన్ చేశాడు. 6 నెలల క్రితమే ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. చివరకు ఆగస్టు 3న కూతురు ఇంటి దగ్గర నుంచి అత్తను కారులో ఎక్కించుకున్నాడు రామచంద్రప్ప. ఆదే రోజు తన స్నేహితులు సతీష్, కిరణ్‌ను కూడా పిలిపించాడు. ప్లాన్ లో భాగంగానే వారిని రప్పించాడు. కారులో కొంత దూరం వెళ్లాక ముగ్గురు కలిసి అత్త లక్ష్మిని చంపేశారు. ఆ తర్వాత శవాన్ని తుమకూరులోని సతీష్ పొలానికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ముగ్గురు కలిసి శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేశారు. వాటిని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేశారు. కారులో తీసుకుని వెళ్తూ.. 19 వేర్వేరు ప్రదేశాలలో పారేశారు. దీనివల్ల బాధితురాలు ఎవరు అనేది గుర్తించకుండా చేయాలని భావించారు..
READ MORE: Hyderabad Rains: 24/7 సేవల్లో హైడ్రా.. విధుల్లో 3565 మంది, అణుక్షణం అప్రమత్తం!
ఇక్కడి వరకు డాక్టర్ రామచంద్రప్ప అండ్ గ్యాంగ్ సరిగ్గానే ప్లాన్ అమలు చేసింది. ఐతే ఆగస్టు 7న రోడ్డు వెంట పడేసిన కవర్‌లోని చేతి భాగాన్ని ఓ కుక్క నోట కరచుకుని రోడ్డుపై వెళ్తుండగా స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కవర్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తనిఖీ చేయగా మరో ఏడు కవర్లలో పాక్షికంగా కుళ్ళిపోయిన స్థితిలో మహిళ శరీర భాగాలు కనిపించాయి. మరోవైపు ఓ చోట తల భాగం కూడా లభ్యమవడంతో మృతురాలిని కోలాల గ్రామానికి చెందిన లక్ష్మీదేవిగా పోలీసులు గుర్తించారు. ఆమె శరీరంపై ఉన్న టాటూల ఆధారంగా చనిపోయింది లక్ష్మీదేవియేనని తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు లక్ష్మీ దేవిని హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో మృతదేహాన్ని ముక్కలుగా కోసి, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి, వివిధ ప్రదేశాలలో పారవేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. తమ వివాహంలో అత్త తరచూ జోక్యం చేసుకోవడం.. భార్యను ప్రభావితం చేసి ఇంట్లో విభేదాలు సృష్టించినందుకు ఆమెను చంపాలని స్కెచ్ వేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు డాక్టర్ రామచంద్రప్ప మొదటి భార్యతో విడాకుల ప్రక్రియ ఇంకా కోర్టులో కొనసాగుతోంది.