ఇండియన్ రైల్వేస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏసీ, నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ సహా సుదూర రైళ్ల ఛార్జీలను పెంచింది. వివిధ కేటగిరీల రైళ్లలో ధరలు పెరిగాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెరగనుండగా.. ఏసీ కేటగిరీ ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసలు పెరుగుతాయి. ఈ కొత్త మార్పు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. సబర్బన్, సీజన్ రైలు టిక్కెట్లలో ఎటువంటి మార్పు ఉండదు. 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఈ పెంపు…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్- ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు పండుగ చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు తనకు తెలుసని.. భూమి చుట్టూ మన త్యాగాలు, జీవితాలు ఉన్నాయన్నారు.. వ్యవసాయం దండుగా అనే రోజుల నుంచి వ్యవసాయం పండుగ…
దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు, ఈరోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 70 లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో రూ. తొమ్మిది వేల కోట్లు వారి ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రైతు భరోసా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన మహాను భావుడు రాజీవ్ గాంధీ అన్నారు. వ్యవసాయం అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే వ్యవసాయమని తెలిపారు. రైతులకు మద్దతు ధర ఇచ్చింది కాంగ్రెస్, రైతులకు నిధులు ఇవ్వాలని చెప్పింది…
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో రూ.10 రూపాయలు ఇచ్చి మైనర్ బాలిక పై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. షీటీం అవగాహనతో విషయం బయటకు వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.. నిందితుడు బంగారిగూడకు చెందిన జాదవ్ కృష్ణగా గుర్తించి అరెస్టు చేశారు.
కష్టపడి బీటెక్ పూర్తి చేశాడు. చదివిన చదువుతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాధించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో జీవితాన్ని స్వార్థకతకు నిదర్శనంగా మలుచుకోవాల్సిన పరిస్థితుల్లో తప్పటడుగు వేశాడు. అంచలంచలుగా ఎదగాల్సిన స్థితిలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అలాగే డ్రగ్స్ అమ్మకాల్లో దిగి కటకటాల పాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగి కథనం ఇది.
కేంద్రం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. అయితే.. ఇది ఎక్కడ లభిస్తుంది? ఈ వార్షిక పాస్ పొందేందుకు అర్హతలు ఏంటి? అని కొందరికి అనుమానం…
2024-25 ఆర్థిక సంవత్సరానికి పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులకు "సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్"ను ప్రదానం చేసింది. జూలై 24, 2024న న్యూఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఐసీఎస్ స్వీకరించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా హాజరై గుర్తింపు పత్రాన్ని అందించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగే లేని.. ఎవరు ఎదుర్కోలేరని సీఎం రేవంత్‌రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. జులై 4 న హైదరాబాద్‌కి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.