Nandyal District: ఆస్తికోసం మనుషులు రక్కసులుగా మారుతున్నారు. ఆస్తి వస్తుందంటే.. కన్న తల్లి ప్రాణాన్ని తీసేంత కసాయిలుగా మారిపోతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా బనగానపల్లె (మం) రాళ్ల కొత్తూరులో ఇలాంటి ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కర్మ కాండలు పూర్తి కాక ముందే ఆస్తి కోసం కన్న తల్లిని చంపేందుకు కొడుకు, మనవళ్ల యత్నించారు.
READ MORE: Vizianagaram : విజయనగరంలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు ఎరువుల కొరతపై ఆగ్రహం
స్థానికుల కథనం ప్రకారం.. వెంకటరాముడు, పుల్లమ్మ ఇద్దరు దంపతులు. భర్త వెంకట రాముడు అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మృతి చెందారు. వీళ్లకు గోపాల్ అనే కుమారుడు ఉన్నాడు. తన భర్త వెంకట రాముడు బతికి ఉండగానే కొడుకు గోపాల్, మనవళ్లు మనోజ్, మనిసాయి ఆసుపత్రి కోసమని తీసుకెళ్లి ఆస్తి మొత్తం రాపించుకున్నారని బాధితురాలు పుల్లమ్మ చెబుతోంది. ఆస్తిని తల్లి పుల్లమ్మ తన కూతురికి రాసి ఇచ్చిందనే అనుమానంతో కొడుకు గోపాల్, మనవళ్లు కలిసి ఆమెను చితకబాదారు. దుర్భాషలాడుతూ కాళ్లతో తన్నుతూ, దుర్మార్గంగా ప్రవర్తించారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. తల్లి బాధను చూడలేక పోలీసులకు సమాచారం అందించింది ఆ వృద్ధురాలి కుమార్తె. సకాలంలో పోలీసులు ఘటనా స్థలానికి రావడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: TTP Terror Attack: పాలుపోసి పెంచిన పాము పాకిస్థాన్‌ను కాటేసింది.. ఉగ్రదాడిలో 12 మంది మృతి