గొప్ప విజనరీ ఉన్న నేత, స్మితప్రజ్ఞశాలీ మోడీ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. స్కాములకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రంత అవినీతి చరిత్ర.. ఎండ్లకు ఏండ్లు అవమాన పడి, కొట్లాడి, ఎదురునిలిచి త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ వల్ల తెలంగాణ ఆతగౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచారన్నారు..
వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను అడిగి సమస్య తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సమస్యను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. వరంగల్, గజ్వెల్ రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
ఏడాదిగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధిని వివరించడానికి ఈ సభ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. 11 ఏళ్లుగా మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 11 ఏళ్లు పరిపాలన చేయడానికి ప్రజలు ఆమోదం తెలిపిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని కొనియాడారు. మరో 11 ఏళ్లు మోడీ పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని.. యూపీఏ ప్రభుత్వంలో ఏ వార్త చూసినా కుంభకోణాలు, అవినీతి పై వార్తలు వచ్చేవన్నారు.
ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బంధువులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
శరీరంలో జరిగే ప్రతి మార్పు, అసౌకర్యానికి సంకేతం. అలాగే కొంతమందికి రాత్రిళ్లు పదే పదే మూత్రం వస్తుంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. రాత్రిమూత్రం తగ్గటానికి జీవనశైలిని మార్చుకోవటం చాలా కీలకం. సమస్య ఒక మాదిరిగా ఉన్నవారికి ప్రధాన చికిత్స ఇదే. చాలావరకు దీంతోనే సమస్య కుదురుకోవచ్చు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని, తనపై జరుగుతున్న కుట్రలకు తాను భయపడనని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. “మా లీగల్ టీమ్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. కౌశిక్‌రెడ్డి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాడి కౌశిక్‌రెడ్డి క్వారీ యజమాని భయభ్రాంతులకు గురి చేశారని.. అతడికి రిమాండ్ విధించాలంటూ పీపీ వాదించారు. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు.
హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కా చెల్లెలు ఇద్దరూ మైనర్లు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన బాలికలుగా పోలీసులు గుర్తించారు. మృతుల పేర్లు వినీల (17), అఖిల (16). వినీల ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకొచ్చారు.