ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆన్-డ్యూటీ యూనిఫాం ధరించి రీల్ చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. మహిళా కానిస్టేబుల్ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యూటీ సమయంలో పోలీసులు రీల్స్ చేయకూడదని స్పష్టం చేస్తూ గతంలో డీజీపీ అన్ని జిల్లాలకు మార్గదర్శకాలను జారీ చేశారు. అయినప్పటికీ.. పోలీస్ స్టేషన్లో పోస్ట్ చేసిన మహిళా పోలీసు వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. విశేషం ఏంటంటే.. ఆమె ఫాలోవర్స్ సంఖ్య 2.5 లక్షలకు పైగా ఉంది.
‘‘స్పేస్‌లో పరిస్థితులకు ఇప్పుడే అలవాటు పడుతున్నాం. అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా తినాలి అనే విషయాలను చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను ఒంటరి కాను.. నా భూజంపై త్రివర్ణ పతాకం ఉంది. అంటే.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే భావన నాకు కలుగుతోంది. రోదసియానంలో నాది చిన్న అడుగే కావొచ్చు. కానీ, భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు." అని శుభాంశు వ్యాఖ్యానించారు.
అనంతపురంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ... రెండు హత్యలు ఒకేలా జరగడం సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు హత్యలకు ఓకే రకమైన ఆయుధాన్ని ఉపయోగించడం పోలీసులకు సవాలుగా మారింది. అనంతపురంలో పగ..
కుటీర పరిశ్రమలా మద్యం తయారీ. యస్.. మీరు విన్నది కరెక్టే. కోనసీమ జిల్లాలో ఇలాగే కొంత మంది ఇంట్లోనే మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి అన్‌బ్రాండెడ్ లిక్కర్ తయారు చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేశారు. కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్ ఉంటే చాలు.. ఇంట్లోనే మద్యం తయారు చేయవచ్చు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఓయో హోటల్లో బ్యూటిషన్ అనూష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్యగా భావించిన హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనూష తల్లిదండ్రులు... ఆత్మహత్య కాదని.. ఆమెకు అలాంటి ఆలోచనలు లేవని.. కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Real Estate Scam: సొంతిళ్లు కోసం కలలు కనే వారే వారి టార్గెట్. వారికి బ్రోచర్లలోనే వైకుంఠం చూపించడం.. అందిన కాడికి దండుకోవడం ఇలా అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. హైదరాబాద్‌లో హంగూ ఆర్భాటాలతో ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు.. ఈ మధ్య కొత్త తరహా చీటింగ్‌కు తెరలేపాయి.
మర్డర్.. ఆ తర్వాత విదేశాలకు చెక్కేయడం.. ఇద్దరూ కలిసి సహజీవనం చేయడం.. ఇలా అంతా ప్లాన్ చేసుకున్నారు ఐశ్వర్య, తిరుమల రావు. కానీ తేజేశ్వర్ మర్డర్ తర్వాత అంతా రివర్స్ అయింది. వారి ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. దీంతో ఇద్దరూ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. కొత్త పెళ్లికూతురు ఐశ్వర్య.. ఆమెతో వివాహేతర బంధం పెట్టుకున్న ప్రియుడు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు ఇద్దరూ దేశ ముదుర్లేనని తెలుస్తోంది..
జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ వ్యవహారానికి పదే పదే అడ్డొస్తుందన్న కారణంతోనే అంజలిని.. కూతురు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో కుమార్తె సహా ఆమెకు సహకరించిన శివ, అతని తమ్ముడు యశ్వంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ఓ గ్రామంలో ప్రేమ జంట పొలంలో రహస్యంగా కలుసుకున్నారు. వాళ్లను గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సమీపంలోని ఆలయంలో ఇద్దరికీ వివాహం చేశారు. ఆ తర్వాత నవ వరుడి వెంట.. వధువును పంపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం ఇద్దరి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు.
ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న కుమారుడే తల్లిని క్రూరంగా చంపేశాడు. కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో 12వ తరగతి చదువుతున్న బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాటలు వినకుండా ఆపినందుకు తన తల్లిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం కింది భాగంలో దాచి పెట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కొడుకు ఈ విషయాన్ని గ్రహించాడు. దీంతో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మర్డర్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది.