బెంగళూరులోని సంపిగేహళ్లి ప్రాంతంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడిపై దాడి చేసి "జై శ్రీరామ్" అని నినాదం చేయమని బలవంతం చేశారని బాధితుడు చెప్పాడు. ఈ సంఘటన జూన్ 22న సాయంత్రం 4:30 - 5:30 గంటల మధ్య జరిగింది. బాధితుడి పేరు జమీర్. వృత్తిరీత్యా మెకానిక్. తన స్నేహితుడు వసీమ్‌తో కలిసి ఓ కస్టమర్ నుంచి డబ్బు వసూలు చేయడానికి బయటకు వెళ్లినట్లు సమాచారం. చొక్కన్హళ్లి సమీపంలోని చెట్ల గుత్తికి చేరుకోగానే.. 5 నుంచి 6 మంది గుర్తు తెలియని…
చాలా మంది బరువు తగ్గడానికి సులభమైన మార్గాల కోసం వెతుకుతారు. అందుకే.. వివిధ కంపెనీలు సప్లిమెంట్లు, కొవ్వు తగ్గించే మాత్రలు, పౌడర్లు, ఇంజెక్షన్లు వంటి ఉత్పత్తులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉంటాయి. చాలా మంది ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు. అలాంటిదే మరో ఇంజెక్షన్ భారత్‌లో విడుదలైంది. జూన్ 24న, డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ బరువు తగ్గించే మందును విడుదల చేసింది. ఈ ఔషధం పేరు వెగోవీ (సెమాగ్లుటైడ్). ఇది ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది.10వ తరగతి బోర్డు పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే నియమాలను ఆమోదించింది. ఇప్పుడు 10వ తరగతి బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్ఈ నిర్వహిస్తుంది. ఈ అంశంపై పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రెండుసార్లు పరీక్షలు నిర్వహించే నమూనాను సీబీఎస్ఈ ఆమోదించిందని తెలిపారు.
అంతరిక్షంలోకి తన చారిత్రాత్మక ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. తన తల్లిదండ్రులతో శుభాంశు శుక్లా మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లే స్పేస్ఎక్స్ అంతరిక్ష నౌకలో ఎక్కడానికి సిద్ధమైన ఆయన.. వీడియో కాల్లో తన కుటుంబానికి ‘నా కోసం వేచి ఉండండి. నేను వస్తున్నా’ అని సందేశం ఇచ్చారు. శుభాంశు తల్లి చక్కెర, పెరుగు కలిపిన పదార్థాన్ని ఆయనకు వీడియో కాల్లో వర్చువల్‌గా తినిపించారు. చాలా మంది భారతీయులు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు ఆచరించే సంప్రదాయంలో ఇదీ ఒకటి.
కుమార్తెలపై కోపంతో ఓ తండ్రి ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల విరాళం ఇచ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు-తిరువణ్ణామలై జిల్లా అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన విజయన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివాసం ఉంటున్నారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ అత్యవసర పరిస్థితిని స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి దినంగా అభివర్ణిస్తారు. అత్యవసర పరిస్థితి సమయంలో, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించారు. దీనికి నిరసనగా ప్రతిపక్షాలు, ఆందోళనకారులు స్టెరిలైజేషన్ నుంచి జైలు శిక్ష వరకు పోరాటాలు చేయాల్సి వచ్చింది.
హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ పదో తరగతి చదువుతున్న బాలిక, ఆమె ప్రేమికుడు శివ, అతని తమ్ముడు కలిసి దారుణంగా తల్లి అంజలిని హత్య చేసిన ఘటన ఒక్కసారికి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ రోజు ఆమె మృతదేహాన్ని సూరారంలోని డా.బీఆర్ అంబేద్కర్ భవన్‌కు తరలించారు. తెలంగాణ సాంస్కృతి సారధి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. మృతదేహాన్ని మహబూబాబాద్ తరలించారు. అయితే.. ఈ దారుణ ఘటనపై నిందితుడి తల్లి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
64 ఏళ్ల వ్యక్తికి ఎప్పుడూ కడుపులో నొప్పి కలిగింది. అతను డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడికి షాక్ అయ్యాడు. నిజానికి, ఆ వ్యక్తి కడుపులో ఒక టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. అతను 12 సంవత్సరాల వయసులో అనుకోకుండా దాన్ని మింగేశాడు. 52 ఏళ్లుగా కడుపులోనే ఉంచుకున్నాడట. చైనాకు చెందిన ఈ వృద్ధుడి కడుపులో 52 సంవత్సరాలుగా టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. పరీక్షల అనంతరం.. అతనికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్ చెప్పారు. ఆ వ్యక్తి లోపల నుండి 17 సెం.మీ పొడవున్న బ్రష్‌ను తొలగించడానికి…
చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే తమకు తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు హైడ్రా విజ్ఞప్తి చేసింది. కబ్జాలపై 8712406899 కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని హైడ్రాధికారులు వెల్లడించారు. నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నగరానికి వరద ముప్పు తప్పించాలంటే గొలుసుకట్టు చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
వరకట్నం కోసం భార్యను హత్య చేశాడు ఓ భర్త.. కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. కోర్టులో ఆ భర్త విచిత్ర కోరిక కోరాడు. ఎంతటి వ్యక్తులకైనా చట్టం ఒక్కటే అని తెలియదేమే విచిత్ర కోరిక కోరాడు. తాను ‘ఆపరేషన్ సిందూర్’లో పని చేశానని.. ఈ కేసులో మినహాయింపు కల్పించాలని ఆ కమాండో సుప్రీంకోర్టును కోరాడు.