శంషాబాద్ లో ఒ వ్యక్తి తన ఇంట్లో ఏకంగా గంజాయి మొక్కలను పెంచాడు. పెంచిన గంజాయి విక్రయిస్తాడా? అతనే సేవిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామంలో ఒ వ్యక్తి తన ఇంట్లో రెండు గంజాయి మొక్కలు పెంచాడు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని.. బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కేసీఆర్ కి ఎదురు తిరగడానికి 9.5 ఏళ్లు పట్టిందని.. కానీ.. రేవంత్ రెడ్డి పాలనకు కేవలం 1.5 ఏళ్లు పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ 50 సంవత్సరాల కాంగ్రెస్ చీకటి అధ్యాయాన్ని తెలియజేస్తుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన మాట్లాడే వారిని చంపివేశారని చెప్పారు.
హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్షిప్లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించినట్టు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరు ఇంటి ఆవరణలోకి వచ్చి పరిశీలిస్తుండగా.. ఎవరని అడిగితే తాము హైడ్రా నుంచి వచ్చామని బదులిచ్చారని ఆ ఇంటి వద్ద పని చేస్తున్న…
రామ్‌చరణ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు నుంచి తెలుసని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ హీరో అయ్యాడు. RRR తో దేశానికి గౌరవం తెచ్చి పెట్టాడని కొనియాడారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. తాజాగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్, హీరోలు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, విజయ్ దేవరకొండకు ముఖ్యమంత్రి స్వయంగా బ్యాడ్జ్ పెట్టారు.
డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు.
భారత ప్రభుత్వం జీఎస్టీలో విస్తృతమైన మార్పులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. చాలా వస్తువులను 12% పన్ను స్లాబ్‌ను తొలగించి, 5% స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇందులో రెండు జాగ్వార్లు ఓ ఎద్దు ముందు మోకరిల్లినట్లు కనిపిస్తోంది. జాగ్వార్ల వంటి ప్రమాదకరమైన మాంసాహారుల నుంచి తన ప్రాణాలను కాపాడుకునే ఈ ఎద్దు, ఎవరూ ఊహించని పని చేసింది. అందుకే ఈ వీడియో ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది.
డీజీపీకి బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. బక్రీద్ 2025 సందర్భంగా పోలీసులు ఎన్ని ఆవులను రక్షించారు..? అని ప్రశ్నించారు. జంతువుల రవాణా, వధకు ఎన్ని పశువైద్య ధృవీకరణ పత్రాలు జారీ చేశారు? రాష్ట్రవ్యాప్తంగా అక్రమ గోవధను ఆపడానికి ఎలాంటి దీర్ఘకాలిక చర్యలు అమలు చేయబడుతున్నాయి? అని అడిగారు.
ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఒకేరోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి..
శంకర్ పల్లి రైలు పట్టాలపై కారు తీసుకెళ్లిన లేడీ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.. ఆత్మహత్య చేసుకునేందుకు కారుతో సహా పట్టాల మీదకి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం తాను ఉంటున్న ప్లాట్ నుంచి కార్ తో సహా బయటికి వచ్చింది సోనీ. తన దగ్గరున్న కుక్కను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలి వెళ్ళిపోయింది.