మధ్యప్రదేశ్లోని రత్లాంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్లోని 19 వాహనాలు మార్గమధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయాయి. ప్రాథమిక దర్యాప్తులో సాంకేతిక లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. అనంతరం వాహనాలు ఆగిపోవడానికి కల్తీ డీజిల్ కారణమని తెలుసుకున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ యాత్ర ఈరోజు అంటే జూన్ 27న ప్రారంభమవుతుంది. ఈ మహా యాత్ర జూలై 8 వరకు కొనసాగుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర పూరి ఆలయం నుంచి గుండిచా ఆలయానికి వారి వారి రథాలపై ఊరేగుతారు. ఈ మహా యాత్ర సందర్భంగా.. జగన్నాథ ఆలయంలో 'ఛేరా పహారా' అనే ప్రత్యేకమైన సంప్రదాయం నిర్వహిస్తారు.…
పహల్గామ్ దాడి తర్వాత తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పాక్ మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాయాది దేశంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్లు, శిక్షణా కేంద్రాలను పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా పీవోకే లోని దట్టమైన అడవుల్లో ఈ కార్యకలాపాలు కనిపిస్తున్నాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెల్లడించింది.
ప్రకృతిలో అనేక జంతువులు, పక్షులు చేసే పనులు చాలా సార్లు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక కాకి దాని అద్భుతమైన తెలివితేటలతో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వైరల్ వీడియోలో ఆ పక్షి కష్టపడి పనిచేయడం కంటే.. తెలివితేటలను ఎలా ఉపయోగించాలో నిరూపించింది. అది అనుసరించిన పద్ధతి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.
కోల్కతాలోని ప్రతిష్టాత్మక లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన అందరినీ కలచివేసింది. ఈ కేసులో పట్టణ పోలీసులు నిందితులు మనోజిత్ మిశ్రా (31), జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖోపాధ్యాయ అలియాస్ ప్రమిత్ ముఖర్జీ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా మాజీ విద్యార్థి, టీఎంసీ స్టూడెంట్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. వాస్తవానికి.. జూన్ 25న కళాశాల లోపల తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు స్థానిక పోలీసులకు తెలిపింది. రాత్రి 7:30…
కర్ణాటక రాష్ట్రం కలబురగి నగర శివారు పట్టన్ గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద దుండగుల బృందం ముగ్గురిని హత్య చేసింది. ఈ ఘనట బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు ధాబాలో పని చేసేవాళ్లు. మృతులను సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32)గా పోలీసులు గుర్తించారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది.
ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్ కింద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) రూ. 9 కోట్ల విలువైన పాకిస్థాన్ మూలానికి చెందిన వస్తువులను స్వాధీనం చేసుకుంది. రూ. 9 కోట్ల విలువైన 1,115 మెట్రిక్ టన్నుల వస్తువులతో నిండిన 39 కంటైనర్లను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. జూన్ 26న, దిగుమతిదారు కంపెనీ భాగస్వామిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
వ్యాపారం ప్రమోషన్ కోసం తమ నెంబర్లను సోషల్ మీడియాతో పాటు ఎక్కడపడితే అక్కడ పెడితే ఇబ్బందులు ఎదుర్కొక తప్పవు.. ఒక వ్యాపారవేత్తకు ఇదే అనుభవం ఎదురయింది.. వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వ్యాపార విషయాలు అడిగి చివరకు తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని చెప్పి కోటి రూపాయలను కొట్టేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన ఓ రియల్టర్ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్ నెంబర్ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఆయనకు కాల్ చేసిన కర్ణాటక ముఠా…
మీ ఫోన్ పోయిందా.. ఐతే దిగులు పడకంటి అంటున్నారు పోలీసులు. జస్ట్ సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తే రికవరి చేస్తామని చెబుతున్నారు. అలా రికవరీ చేసిన ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందించారు. ఫోన్ పోయిన వెంటనే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీఈఐఆర్ పోర్టల్లో మీ ఫోన్ వివరాలు పొందుపరచండి.