Vijayawada: విజయవాడ BRTS రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫుడ్ జంక్షన్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యూట్యూబర్లతో కలిసి రీల్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించని యువకులను మందలిస్తున్నట్టు వీడియోలు చేస్తున్న క్రమంలో ఓ సీఐ బూతులు తిట్టారు. దీంతో యువకులు పోలీసులకు ఎదురు తిరిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి మిగతా వాహనదారులు మద్దతుగా నిలిచారు. దీంతో అదనపు సిబ్బందిని ఘటన స్థలానికి రప్పించారు పోలీసులు.. ఈ ఘటనపై సీఐ కిషోర్ యువకులకు క్షమాపణలు చెప్పారు. మద్యం సేవించి ఉన్నామంటూ తమను బూతులు తిట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని యువకుల డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: Hyderabad Rains : హైదరాబాద్‌లో కుండపోత.. బయటకు రాకండి..
కాలర్ మైక్ పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.. సోషల్ మీడియాలో తమను దోషులుగా చూపిస్తారని యువకుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ చలనాలు ఉన్నందుకు బూతులు తిట్టారని, ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పిస్తామని బతిమాలినా వినకుండా అందరిలో పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బెజవాడ పోలీసుల వైఖరి చర్చనీయాంశంగా మారింది. కింద స్థాయి సిబ్బందిపై పట్టు లేకపోవడంతో ఎవరికి వారు రీల్స్‌తో ప్రమోషన్స్ చేసుకుంటున్నారని జనాలు మండిపడుతున్నారు..
READ MORE: Uttar Pradesh: ఘోరం.. 15 రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు..