Why Do People Switch to English After Drinking: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మద్యం సీసాపై హెచ్చరిక రాసి ఉంటుంది. ఎలా హానికరమో ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణించిన కేసులు కూడా ఉన్నాయి. మద్యపానం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు మానరు. అంతే కాదు.. మన దేశంలో మద్యానికి కష్టానికి అనుసంధానం ఉంది. పొదస్తమానం కష్టం చేసి సాయంత్రానికి ఓ పెగ్గు వేస్తే సుఖంగా నిద్ర పడుతుందని నమ్ముతుంటారు. అయితే.. మద్యం తాగే ముందు స్పష్టమైన తెలుగులో మాట్లాడే ఫ్రెండ్.. మద్యం సేవించిన తర్వాత ఇంగ్లీషులో మాట్లాడుతుండటం మనం చాలా సందర్భాలలో గమనించి ఉంటాం. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు చూద్దాం..
READ MORE: H-1B visa: H-1B వీసాలపై మరిన్ని కఠిన నిర్ణయాలు.. ఫిబ్రవరి నాటికి కొత్త వ్యవస్థ..
‘జర్నల్ ఆఫ్ సైకోఫార్మకాలజీ’ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం కొద్దిగా మద్యం సేవించిన తర్వాత వచ్చే మత్తు మరొక భాష మాట్లాడటానికి సహాయపడుతుంది. యూనివర్శిటీ ఆఫ్ లివర్‌పూల్, బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజ్, నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ యూనివర్శిటీ పరిశోధకులు ఇటీవల డచ్ నేర్చుకుని డచ్ మాట్లాడే నెదర్లాండ్స్‌లో చదువుతున్న 50 మంది జర్మన్ల బృందాన్ని నియమించారు. తాగిన తర్వాత మన భాష ఎందుకు మారుతుంది? అనే విషయం గురించి వీరిపై అధ్యయనం చేశారు. భాష కూడా మన ప్రవర్తనే. ఇది మన దృక్కోణాన్ని ఒకరికొకరు తెలియజేసే ప్రవర్తన. తాగిన తర్వాత మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అందులో భాగమే భాషలో మార్పు. ఎక్కువగా తాగేవారిలో గతంలో కంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మద్యం మత్తులో ఉన్న ఈ వ్యక్తులు పూర్తి విశ్వాసంతో ఎదుటివారి ముందు తమ అభిప్రాయాన్ని ఉంచుతారు. కొత్త భాష నేర్చుకోవడానికి భయపడే వారికి, మద్యం ఆ కొత్త భాషను మాట్లాడటానికి, నేర్చుకోవటానికి సహాయపడుతుంది. సాధారణంగా ఇంగ్లీషు భాషపై పట్టు తక్కువగా ఉన్నవారు ఎవరి ముందు అయినా ఇంగ్లీషులో మాట్లాడేందుకు భయపడతారు. కానీ మద్యం సేవించిన తర్వాత అదే వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా ఇంగ్లీషులో తప్పో, ఒప్నో అనర్గళంగా మాట్లాడటం ప్రారంభిస్తారు. ఎందుకంటే మద్యం సేవించిన తర్వాత వారి భయం పోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.