IND vs PAK: 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా, ఇండియా, పాకిస్థాన్ టైటిల్ కోసం తలపడనున్నాయి. 1984లో ఆసియా కప్ జరిగినప్పటి నుంచి ఇండియా, పాక్ మధ్య ఎప్పుడూ ఫైనల్ జరగలేదు. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్ ఘర్షణ ప్రారంభమయ్యే ముందు.. భారత్, పాక్ జట్లు ఎన్నిసార్లు ఫైనల్‌కు చేరుకున్నాయి? వాటి గెలుపు-ఓటమి నిష్పత్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొదట టీం ఇండియా గురించి మాట్లాడుకుందాం. భారత జట్టు ఇప్పటివరకు 11 సార్లు ఆసియా కప్ ఫైనల్‌కు చేరింది. తాజాగా 12 సారి పాకిస్థాన్‌తో తలబడబోతోంది. ఇందులో భారత జట్టు ఎనిమిది సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. మూడు స్లార్లు ఓటమి పాలైంది. రన్నరప్‌గా నిలిచి సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఆసక్తికరంగా ఈ మూడు సందర్భాలలో శ్రీలంక భారత జట్టును ఓడించింది. కానీ.. ఈసారి శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరుకోలేదు.
READ MORE: CM Yogi: ‘‘ఘజ్వా-ఏ-హింద్ భారత్‌లో జరగదు’’.. నరకానికి వెళ్లాలంటే ఆ కలలు కనండి..
ఇప్పుడు పాకిస్థాన్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్థాన్ జట్టు ఐదుసార్లు ఆసియా కప్ ఫైనల్ కు చేరుకుంది. రెండుసార్లు గెలిచి మూడుసార్లు ఓడిపోయారు. అంటే పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ లో భారతదేశం కంటే చాలా తక్కువ సార్లు ఫైనల్ కు చేరుకుంది. 5 సార్లు ఫైనల్‌కు చేరిన పాకిస్థాన్ జట్టు విజయం శాతం తక్కువగా ఉంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించడం తథ్యమని నిపుణులు చెబుతున్నారు.