సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న ఓ వృద్దురాలికి ఓ ఫోన్ కాల్…
యూట్యూబర్ పూల చొక్క నవీన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని నవీన్‌పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా..రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు. కానీ.. హైదరాబాద్ పోలీసులు మాత్రం ఇట్టే పట్టేసుకున్నారు. వాస్తవానికి.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని శిర్డీ హిల్స్‌లో చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో దొంగతనం చేసినవారు ఎవరూ కాదండీ.
మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ ని గెలిపిస్తే అప్పుల కుప్ప చేసి తెలంగాణని దోచుకున్నారని విమర్శించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు.
నిత్యం ఉదయాన్నే అనేక కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లను చూస్తునే ఉంటాం. విజయ, దొడ్ల, హెరిటెజ్ ఇలా అనేక రకాల ప్యాకెట్లు మార్కెట్లోని దుకాణాలు, హోటళ్లలో లభిస్తాయి. కానీ ఒక హోటల్ల్లో మాత్రం తినుబండరాలతో పాటు ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో కల్లు ప్యాకెట్లు పట్టుబడటం ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ సిబ్బందిని అశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్‌లోని గుండ్ల పోచంపల్లి అయోధ్యనగర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా హోటల్లో కల్లు అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో సీఐ సుబాష్ చందర్, ఎస్సైలు అఖిల్, రవిచంద్ర సిబ్బంది కలిసి హోటల్‌పై దాడి…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల24న విచారణకు రావాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రితోపాటు పీఆర్వో, పీఏలకూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ లో స్టేట్ మెంట్ ఇచ్చేందుకు బండి సంజయ్ అంగీకరించారు. అదేరోజు పీఆర్వో మధు, పీఏ ప్రవీణ్ ల స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి నివాసానికి వచ్చిన సిట్ అధికారులు నోటీసులందించారు. కొద్దిరోజుల క్రితమే బండి సంజయ్…
దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని(తీర్పు) తానే మార్చుకుంది. 12 ఏళ్ల బాలుడి హృదయ స్పర్శి కథను విన్న సుప్రీంకోర్టు అతని సంరక్షణ బాధ్యతను తిరిగి అతని తల్లికి అప్పగించింది. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఆ బాలుడు మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్న తీరుకు కోర్టు కరిగిపోయింది. ఆ బిడ్డ పరిస్థితి చూసి, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తులు చలించిపోయారు. కోర్టు పది నెలల క్రితం ఇచ్చిన తన ఉత్తర్వును మార్చుకుని,…
తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజిల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ప్రైవేట్ కాలేజీల్లో 2025-26గానూ ఉన్నత విద్యామండలి ఈ షెడ్యూల్ విడుదల చేయగా.. జూలై 19నుంచి ఈ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అగస్టు 10 వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. ఎప్‌సెట్, సీసీబీ, జోసా షెడ్యూల్‌కు అనుగుణంగా దీనిని రూపొందించారు. అప్లికేషన్లతో పాటు ఇతర వివరాల కోసం అధికార వెబ్సైట్ https://tgche.ac.in/ ను సంప్రదించాలని ఉన్నత విద్యామండలి సూచించింది.
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో గడువు ముగిసిన హెపటైటిస్-బి వ్యాక్సిన్లను నిర్లక్ష్యంగా ఇవ్వడం పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ బాధితుడు హెచ్ఆర్సీని ఆశ్రయించాడు..
ఈ రోజు చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై చెత్త వాగుడు వాగారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నువ్వు గజినీవి.. నీ చుట్టూ ఉన్నది చెత్త బ్యాచ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిట్‌చాట్ లో హరీష్ మాట్లాడారు. బనకచర్ల పై రేవంత్ రెడ్డి బాగోతం నగ్నంగా బయట పడిందన్నారు. ఆయన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.