BRS Protest: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ తలసాని, పద్మారావు రెత్తిఫైల్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆర్టీసి క్రాస్ రోడ్ బస్ భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు.. హరీష్‌రావు మెహిదీపట్నం నుంచి బస్సులో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. బస్ భవన్ లోపలికి వెళ్లేందుకు ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతిచ్చారు. కేటీఆర్, హరీశ్ రావు, తలసాని, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు బస్ భవన్ లోపలకి వెళ్లారు. RTC MD నాగిరెడ్డిని కలిశారు. ఛార్జీలు తగ్గించాలని పార్టీ తరపున లేఖ అందజేశారు. ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడిగిన తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాగిరెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలతో ముంచెత్తారు. కార్గోను ప్రైవేట్ పరం చేశారని.. త్వరలో ఆర్టీసీని సైతం ప్రైవేట్ పరం చేస్తారా? అని అడిగారు. అలాంటి నిర్ణయం తీసుకోలేని ఎండీ నాగిరెడ్డి వివరించారు.
READ MORE: IPS Officer Suicide: ఐపీఎస్ను బలి తీసుకున్న కుల వివక్ష.. ఉన్నతాధికారిపై ఐఏఎస్ ఫిర్యాదు
కాగా.. అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్, హరీష్‌రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తనతోపాటు, బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపుపై కేటీఆర్ స్పందించారు. “పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయంకి వెళ్లి ఒక లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నాం. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తా అంటే భారీగా పోలీసులను ప్రభుత్వం ఇంటి ముందు మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారు. మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిది. ఎన్ని రకాల కుట్రలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటాం. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు, మా పార్టీకి కొత్త కాదు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.