ఉండవల్లి లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ సాగింది. రద్దీ ప్రాంతాల నిర్వహణ, మహిళా నేతలపై అసభ్య ప్రచారంపై మాట్లాడారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం-బనకచర్ల, హంద్రీనీవాపై, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై చర్చించారు.
టీజీ ఎంసెట్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కౌన్సిలింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మొత్తం 172 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 83,054 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పెంపుడు పిల్లులు మహిళలను రక్షించాయి. వాస్తవానికి.. ఒక మహిళ తన గదిలో సోఫాలో కూర్చుని తన ఫోన్ చూసుకుంటూ ఉండగా.. అకస్మాత్తుగా అక్కడ కూర్చున్న పెంపుడు పిల్లి ఒక వింత ప్రమాదాన్ని గ్రహించి వెంటనే అప్రమత్తమైంది. కొన్ని సెకన్ల తర్వాత అక్కడ ఏమి జరిగిందో తెలియలేదు. కానీ.. పిల్లుల కారణంగా.. ఆ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ సంఘటన మొత్తం CCTV కెమెరాలో రికార్డయింది. ఈ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత సాయుధ దళాలు కొత్త బ్యాచ్ AK-203 అస్సాల్ట్ రైఫిల్స్‌ను పూర్తి స్థాయిలో పొందబోతున్నాయి. ఇది కలాష్నికోవ్ సిరీస్‌లో అత్యాధునికమైన వెర్షన్. ఈ రైఫిల్ నిమిషంలో 700 రౌండ్ల వరకు కాల్పులు జరపగలదు. 800 మీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో దీన్ని తయారు చేస్తున్నారు. ఇది భారత్- రష్యా మధ్య జాయింట్ వెంచర్. ‘షేర్’ పేరుతో ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తోంది.
బాధ్యతారహితమైన ప్రతిపక్షం ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిపైన జగన్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పోలవరంపై అబద్ధాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు.
అమరావతి లో గ్రీన్ హైడ్రోజెన్ వ్యాలీ నిర్మాణం పై దృష్టి పెడతామన్నారు సీఎం చంద్రబాబు... రెండు రోజుల గ్రీన్ హైడ్రోజెన్ సమిట్ తర్వాత డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు.. ఎస్ ఆర్ ఎం లో జరుగుతున్న రెండు రోజుల సమిట్ కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇంధన రంగంలో సమూల మార్పులు రావాలని తను బలంగా కోరుకుంటున్నా అన్నారు. గతంలో కరెంటు కూడా సరిగా ఉండేది కాదని.. చాలా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం ఉండేది కాదన్నారు.. కరెంట్…
భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ జాడపై కీలక సమాచారం బయటకు వచ్చింది. ఓ జాతీయ మీడియా ఈ సమాచారాన్ని అందించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో మసూద్ అజార్ కీలక స్థావరం బహవల్పూర్ ఉంది.. ఈ ప్రాంతానికి దాదాపు 1,000 కి.మీ దూరంలో ఈ ఉగ్రవాది ఉన్నట్లు తెలుస్తోంది. బహవల్పూర్ బురుజుకు 1,000 కి.మీ దూరంలో ఉన్న సీఓకేలో మసూద్ అజార్ కనిపించాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా.. అజార్ ఇటీవల స్కార్డులోని సద్పారా రోడ్ ప్రాంతంలో…
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో పబ్ యజమానులకు చుక్కెదురైంది. ఈగల్ టీం మూడు పబ్బుల యజమానులపైన కేసులు నమోదు చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు బట్టబయలైంది.
ఒకప్పుడు భర్తల వేధింపులు భరించలేక భార్యలు ఆత్మహత్యలకు పాల్పడేవారు. తర్వాత కట్నం వేదింపులకు మహిళలు బలయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భార్య వేదింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంత మంది భర్తలు. సరిగ్గా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు బ్రహ్మయ్య, కౌసల్య. వీరిద్దరూ భార్యాభర్తలు. కాపురానికి వచ్చిన మొదటి మూడు నెలలు అంతా బాగానే ఉంది. తర్వాత అత్తతో కౌసల్యకు విభేదాలు మొదలయ్యాయి. అది కాస్తా ముదిరింది. దీంతో తాను ఇంట్లో ఉండనని తేల్చిచెప్పింది…
కడప జిల్లా గండికోటలో యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ఇప్పటికీ గండికోట రహస్యంగానే ఉంది. ఆమెను ఎవరు హత్య చేశారో ఇప్పటి వరకు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు పోలీసులు. ప్రియుడే హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రియుడి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. ఇంతకీ పలు మలుపులు తిరుగుతున్న వైష్ణవి హత్య కేసులో ప్రధాన పాత్రధారులెవరు? హత్యా, పరువు హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి శవమై తేలింది. ఆమెను ఎవరు హత్య…