Ratan Tata Death Anniversary: ఈరోజు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా వర్ధంతి. ఆయన అక్టోబర్ 9, 2024న 86 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఉన్నప్పటికీ, ఆడంబరానికి దూరంగా సరళమైన జీవితాన్ని గడిపారు. వివిధ వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయంలో గణనీయమైన భాగాన్ని ఇతరులకు సహాయం చేయడానికి విరాళంగా ఇచ్చారు. విశేషమేమిటంటే.. ఆయన తాకిన ప్రతి వ్యాపారం బంగారంగా మారింది. కానీ.. రతన్ టాటా ప్రేమలో విఫలం అయ్యారు.
READ MORE: Uravakonda Library: ఆ లైబ్రరీకి నిత్యం చిరంజీవి, జూ.ఎన్టీఆర్ సహా ప్రముఖులు..! షాకైన మంత్రి..
సాధారణ పౌరుల నుండి వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించాలనుకునే వారి వరకు అందరికీ స్ఫూర్తిదాయకంగా మారిన రతన్ టాటా, డిసెంబర్ 28, 1937న పార్సీ కుటుంబంలో జన్మించారు . అయితే, అతని బాల్యంలో కష్టపడాల్సి వచ్చింది. చిన్నతనంలోనే 1948లో అతని తల్లిదండ్రులు విడిపోయారు. అనంతరం ఆయనను అమ్మమ్మ నవజ్‌బాయి టాటా పెంచారు. కాగా… రతన్ టాటాకు వివాహం కాలేదు. ఆయనకు ఒక లవ్‌స్టోరీ ఉంది. పట్టిందల్లా బంగారమైనప్పటికీ.. ప్రేమలో మాత్రం ఫెయిల్ అయ్యారు. రతన్ టాటా లాస్ ఏంజిల్స్‌లో ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అప్పుడు అకస్మాత్తుగా తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగోకపోవడంతో భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. తనతో పాటు తాను ప్రేమించిన యువతి కూడా భారత్‌కు వస్తుందని రతన్ టాటా భావించారు. రతన్ టాటా ప్రకారం.. 1962 నాటి ఇండియా-చైనా యుద్ధం కారణంగా, ఆమె తల్లిదండ్రులు అమ్మాయిని భారతదేశానికి పంపించడానికి ఇష్టపడలేదు. దీంతో వారి ప్రేమ విఫలమైంది. టాటా ప్రియురాలు అమెరికాలో మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది.
READ MORE: Uravakonda Library: ఆ లైబ్రరీకి నిత్యం చిరంజీవి, జూ.ఎన్టీఆర్ సహా ప్రముఖులు..! షాకైన మంత్రి..