హైదరాబాద్ వాతావరణ కేంద్రం నగర ప్రజలను అలర్ట్ చేసింది. రాబోయే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ అంతటా కుములోనింబస్ తుఫాను విస్ఫోటనం జరుగుతోందని వెల్లడించింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రదేశాల్లో భారీ వర్షం కురువనుందని తెలిపింది. ఇళ్లకు వెళ్లే వాళ్లు త్వరగా బయలు దేరాలని సూచించింది.
ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. గుండెపోటు నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారి జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది ప్రతి యువకుడి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్నగా మారుతోంది. ఇందులో ప్రధాన కారణం రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించడం వల్ల గుండెపోటు కేసులు యువతలో తరచుగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారని.. పోలీసులను తాబేదార్లుగా మార్చుకున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తాజాగా తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రశ్న, నిరసన కచ్చితంగా ఉండాలన్నారు. తెలంగాణలో ప్రశ్నించడానికి, నిరసన తెలపడానికి హక్కు లేదని.. బీఆర్ఎస్ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం బదులు అనుముల రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. మల్కాజిగిరిలో మెదక్ ఎమ్మెల్యే తన రౌడీ అనుచరులతో వెళ్లి.."ఏయ్ సీఐ ఇటు రా.." అని పిలిచారని తెలిపారు. కారు బానెట్ పై…
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఒక వివాహిత మహిళ కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. నిందితుడి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఆ మహిళ కోర్టును కోరింది. అయితే, ఈ కేసులో కోర్టు ఆశ్చర్యకరమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఆ మహిళను హెచ్చరించింది. తన వివాహ జీవితంలో భర్త కాకుండా వేరే వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉంటే ఆమెపై కేసు నమోదు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ పర్యటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీకి వెళ్లడం నేరంగా మాట్లాడుతున్నారు.. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతోనే మాట్లాడాలన్నారు. ఢిల్లీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లాలి.. ఫామ్ హౌస్ కి వెళ్ళాలా? అని ఫైర్ అయ్యారు. 33, 34 సార్లు ఢిల్లీకి వచ్చానని.. 48 సార్లు వచ్చానని మాట్లాడుతున్నారన్నారు. తన ప్రియారిటి రాష్ట్రమని.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ , వివాదాలను పరిష్కరించుకోవడం ముఖ్యమన్నారు.
Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. గుండె నొప్పితో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బత్తిని మనితేజ (17) గుండె నొప్పితో మృత్యుఒడికి చేరుకున్నాడు. మణితేజ స్వగ్రామం శాయంపేట మండలం ప్రగతి సింగారం.
క్యాన్సర్ అంటే ఏమిటి? సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను 'కణితి'( ట్యూమర్) అని పిలుస్తారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా, ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.
What is Black Magic: చేతబడి ఆరోపణలపై హత్యలు చేయడం పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చేతబడి పేరుతో హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో తోడబుట్టిన వాళ్ళను హత్య చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నారు జనం. ఏదైనా రోగం వస్తే మంత్రాలతోనే వచ్చిందని నమ్ముతున్నారు.