KTR Hhouse Arrest: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం ప్రకటించారు. ఈ రోజు ఉదయం బస్ భవన్ కి సిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఉదయం 8.45కి రేతిబౌలి నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కేటీఆర్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు నిర్ణయించారు. ముందుగానే రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావును సైతం హౌస్ అరెస్ట్ చేశారు.
READ MORE: Dowry Harassment: భర్తే భార్యను చంపి పరార్.. పరుపు కింద విగతజీవిగా..!
తనతోపాటు, బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపుపై కేటీఆర్ స్పందించారు. “పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయంకి వెళ్లి ఒక లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నాం. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తా అంటే భారీగా పోలీసులను ప్రభుత్వం ఇంటి ముందు మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారు. మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిది. ఎన్ని రకాల కుట్రలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటాం. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు, మా పార్టీకి కొత్త కాదు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
READ MORE: Coldref Cough Syrup Case: 20 మంది చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్..