Bihar: ఇది కలియుగం. ప్రియుడి కోసం ప్రియురాలు.. లవర్ కోసం ప్రియుడు కట్టుకున్న వాళ్లను మట్టుబెడుతున్నారు. అలాంటి మరో ఘటన తాజాగా బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. అల్రెడీ రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి.. మూడో సారి పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రెండో భార్యను మట్టుబెట్టాడు.
READ MORE: Sai Pallavi : సాయిపల్లవికి తమిళనాడు ప్రభుత్వం నుంచి మరో గుర్తింపు!
పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వికాస్ కుమార్ ఐదు సంవత్సరాల క్రితం సునీతా దేవిని (25) వివాహం చేసుకున్నాడు. కుమార్‌కి అల్రెడీ గతంలో వివాహం జరిగింది. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే దేవిని వివాహం చేసుకున్నాడని సునీత తండ్రి చెప్పారు. అయితే.. కొన్ని గొడవల అనంతరం కుమార్ కుటుంబం సునీతను కుటుంబీకులను ఒప్పించింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిద్దరూ పుట్టిన కొద్దికాలానికే మరణించారు. ఆ తర్వాత కుమార్ తన ప్రియురాలిని వివాహం చేసుకోవాలని భావించాడు. తన రెండో భార్య సునీతా దేవితో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ గొడవలు జరుగుతూనే ఉండేవి. అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లి పోయింది. గత నెలలో దుర్గా పూజ పండుగకు ముందు, కుమార్ సునీత ఇంటికి వెళ్లి ఆమెను తనతో తిరిగి రమ్మని కోరాడు. ఆమె అంగీకరించి తన భర్త వెంట వచ్చింది.
READ MORE: Tragedy: మెదక్ జిల్లాలో విషాదం.. అత్యాచారానికి గురైన మహిళ మృతి!
అయితే.. శనివారం మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో ఆ రోజు తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో తర భార్యపై పెట్రోల్ పోసి వంట గ్యాస్ స్టవ్ వాల్వ్‌ను ఆన్ చేశాడు కుమార్. అగ్గి పుల్ల వెలిగించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని మహిళ కుటుంబానికి అప్పగించారు. ప్రస్తుతం భర్త, అత్తమామలు పరారీలో ఉన్నారు.