APJ Abdul Kalam: మిసైల్ మ్యాన్‌గా, భారత రాష్ట్రపతిగా అంతకు మించి ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన వెళ్లిపోయినా, ఆయన తాలూకు స్ఫూర్తి మాత్రం చిరకాలం నిలిచిపోతుంది. శాస్త్రవేత్తగా మన దేశానికి అందించిన విజ్ఞానం అపారం. అందుకే ఆయనను భారతరత్న కూడా వరించింది. 2015లో జులై 27న ఆయన ఈ లోకం వదిలి వెళ్లిపోయారు. ఈ రోజు ఆయన జయంతి. అబ్దుల్ కలా జీవితంలోని ఓ కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అబ్దుల్ కలాం అక్టోబర్ 15, 1931న తమిళనాడు రామేశ్వరంలోని పంబన్ ద్వీపంలో తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులాబ్దీన్ మారకయ్యర్ ఒక ఓడరేవు మాలికుడు. స్థానిక మసీదు ఇమామ్‌గా పని చేశాడు. తల్లి అషియమ్మ గృహిణి. ఆయన కుటుంబం మరకయ్యర్ వర్గానికి చెందినది.
READ MORE: PM Modi Tour Schedule: రేపు ఏపీకి ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అయితే.. కలాం సెక్రటరీ నాయర్ అబ్దుల్ కలాం గురించి ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి పంచుకున్నారు. ఇఫ్తార్ విందును అబ్దుల్ కలాం ఎందుకు వద్దనుకున్నారో తెలిపారు. 2002 నవంబర్‌లో ఒకసారి కలాం తనను పిలిచి ఇఫ్తార్ విందు ఎందుకు నిర్వహించాలో చెప్పమని అడిగారట. ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చవుతుందో లెక్కలేయించారట. సుమారు రూ. 25 లక్షలు అవుతుందని నాయర్ చెప్పారట. ఇఫ్తార్ విందుకు బదులుగా మనం ఈ డబ్బును అనాథాశ్రమనికి ఎందుకు ఇవ్వకూడదు? అని కలా అడిగారట. ఈ డబ్బు వృథా కాకుండా చూడమని తనకు చెప్పినట్లు నాయర్ వెల్లడించారు. రాష్ట్రపతిభవన్ నుంచి పిండి వంటలు, పప్పులు, దుప్పట్లు, స్వెట్టర్లను 28 అనాథాశ్రమాలకు పంపించారు. ఇది ఇక్కడితో ఆగలేదని.. ఇప్పటి వరకు దానం చేసిన డబ్బు ప్రభుత్వానిదని.. తన సొంత డబ్బు నుంచి లక్ష రూపాయలు తీసి ఇచ్చారట. ఈ లక్షను కూడా ఇలాగే అనాథ పిల్లల కోసం ఖర్చు పెట్టండని కోరినట్లు నాయర్ తెలిపారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అని అబ్దు్ల్ కలాం చెప్పినట్లు నాయర్ వివరించారు.