Giorgia Meloni: ప్రపంచ వ్యాప్తంగా చర్చ..! ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తాగే సిగరెట్ ఏదో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giorgia Meloni: ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియో మెలోని ధూమపానం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్.. మెలోనిని ధూమపానం మానేయమని సలహా ఇచ్చారు. యూరోపియన్ మీడియా పొలిటికో ఈ విషయంపై నివేదించింది. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. అసలు మెలోని ఏ సిగరెట్ తాగుతుంది? అనే చర్చ జోరందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నెట్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. అయితే.. గతంలో ఈ విషయంపై మెలోని క్లారిటీ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Charlie Kirk: చార్లీ కిర్క్ 32వ బర్త్‌డే.. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేసిన ట్రంప్
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
2022 ఎన్నికల ప్రచారంలో జార్జియా మెలోని తన అనుభవాలను వివరిస్తూ తన వెబ్‌సైట్‌లో ఆత్మకథను ప్రచురించింది. అదే నివేదికలో మెలోని అప్పుడప్పుడు అల్ట్రా-స్లిమ్(చాలా సన్నని) సిగరెట్లు తాగుతానని పేర్కొంది. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతుంది? బ్రాండ్ ఏది అనే వివరాలను అందించలేదు. ప్రధానమంత్రి అయిన తర్వాత, మెలోని ఒక వైన్ ఫెయిర్‌లో కీలక వ్యాఖ్యలు చేసింది. తాను మద్యం సైతం తాగుతానని.. మితంగా తీసుకుంటానని చెప్పింది. ఈ ఫెయిర్‌లో మద్యం ఎలా తాగాలో ఆమె వివరించి అందరినీ ఆశ్చర్య పరిచింది. మరోవైపు.. ఇటాలియన్ ప్రభుత్వం ప్రకారం, 2023 నాటికి దేశవ్యాప్తంగా సిగరెట్ తాగే వారి సంఖ్య 10.5 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. 15 ఏళ్లు పైబడిన వారిలో 20 శాతం మంది ధూమపానం చేస్తున్నారు. ఇటలీలో, 22 శాతం మంది పురుషులు, 16 శాతం మంది మహిళలు ధూమపానం చేస్తున్నారు. దాదాపు 5 శాతం మంది రోజుకు 20 కంటే ఎక్కువ సిగరెట్లు తాగుతున్నారు.
READ MORE: IND vs AUS: కోహ్లీ మిస్టర్ పర్‌పెక్ట్.. 3 మ్యాచ్‌లలో 2 సెంచరీలు చేస్తాడు!
అసలు సిగరెట్ తాగుతున్న విషయం ఎలా బయటపడింది..?
ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఈ సమావేశానికి 20 దేశాలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇటలీ ప్రధాని మెలోని, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సహా తదితరులంతా పాల్గొన్నారు. అయితే శాంతి సదస్సులో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్-ఇటలీ ప్రధాని మెలోని మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చాలా అందంగా ఉన్నావు.. కానీ ధూమపానం చేయడమే బాగోలేదని మెలోనికి ఎర్డోగన్ సూచించారు. ఇకనైనా సిగరెట్ తాగడం మానేయాలని మెలోనిని ఎర్డోగన్ కోరారు. ఈ సందర్భంగా మెలోనిని ఒప్పిస్తున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పక్కనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా ఉన్నారు.
READ MORE: IND vs AUS: కోహ్లీ మిస్టర్ పర్‌పెక్ట్.. 3 మ్యాచ్‌లలో 2 సెంచరీలు చేస్తాడు!
‘‘నువ్వు విమానం నుంచి కిందకు దిగడం నేను చూశాను. నువ్వు చాలా బాగున్నావు. కానీ నేను నిన్ను ధూమపానం మానేయించాలి.’’ అని మెలోనితో ఎర్డోగన్ చెప్పాడని ఇహ్లాస్ న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసిన వీడియోలో కనిపించింది. సమీపంలో నిలబడి ఉన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నవ్వుతూ కనిపించారు. ఎర్డోగన్ మాటలకు మాక్రాన్ జోక్యం పుచ్చుకుని ‘‘అది అసాధ్యం!’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మెలోని కూడా హాస్యంతో ప్రతిస్పందించింది. ‘‘నాకు తెలుసు, నాకు తెలుసు. నేను ఎవరినీ చంపాలనుకోవడం లేదు.’’ అని తెలిపారు. మెలోని 13 ఏళ్ల పాటు సిగరెట్ తాగడం మానేశారు. ఇటీవల మళ్లీ తిరిగి ధూమపానం చేయడం ప్రారంభించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మెలోని చెప్పుకొచ్చారు. మళ్లీ కొత్తగా సిగరెట్ తాగడం మొదలు పెట్టినట్లు తెలిపారు. అయితే ఎర్డోగన్-మెలోని సంభాషణపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ల చేస్తున్నారు. సిగరెట్లు తాగడం మానేస్తే బాగుండును అని కొందరు కామెంట్లు పెట్టారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
నోట్: ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇది క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధుల వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలోని దాదాపు ప్రతి అవయవానికి ఇది హాని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మరణాలకు కారణమవుతుంది.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!