ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్ కు పిలిచి వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కొట్టివేయాలని పోలీసులు కోరారు. ప్రభాకర్ రావు పిటిషన్ ఆగస్టు 4వ తేదీన విచారణకు రానుంది.
గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఓ పెద్ద ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేసింది. భారత ఉపఖండంలోని అల్ ఖైదా (AQIS)తో సంబంధం ఉన్న మాడ్యూల్‌ను ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ అధికారుల ప్రకారం.. పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరు గుజరాత్, ఒకరు ఢిల్లీ, మరొకరు నోయిడా (ఉత్తరప్రదేశ్)కు చెందిన వారిగా గుర్తించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రీ ఫైనల్స్ లాంటివని.. ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు.
Renault Triber Facelift Price & Features: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ చౌకైన 7 సీటర్ కారు 'రెనాల్ట్ ట్రైబర్'కి చెందిన కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ కాంపాక్ట్ ఎంపీవీకిని కొత్తగా తీర్చిదిద్దారు. గతంలో ఈ కారును చిన్న చిన్న మార్పులతో విడుదల చేశారు. ప్రస్తుతం 'రెనాల్ట్ ట్రైబర్' నూతన వేరియంట్ ఆకర్షణీయమైన లుక్స్, అధునాతన ఫిచర్లతో వస్తోంది. దీని ధరను రూ. 6.29 లక్షల నుంచి రూ. 8.64…
Fake Facebook Account in Telangana BJP: తెలంగాణ బీజేపీ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సెంట్రల్ జోన్, సైబర్ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ ఖాతాలో అభ్యంతరకరమైన, తప్పుడు కథనాలను పోస్ట్ చేస్తున్నారని.. ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులలో గందరగోళం, విభేదాలకు కారణమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Wife Kills Husband: భర్త తనను లైంగికంగా సంతృప్తి పరచలేదనే కారణంతో భార్య దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్ (29) భార్యాభర్తలు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని జూలై 20వ తేదీ సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో నిహాల్ విహార్ ప్రాంతంలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఇర్ఫాన్‌ను ఫర్జానా ఖాన్ తీసుకొచ్చింది. ఇర్ఫాన్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.…
Diabetes: డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది.
కాకినాడకు చెందిన దళిత యువకుడు, డైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి, డోర్ డెలివరీ చేశారన్న నేర ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసులో రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దళిత యువకుడి హత్య కేసు తదుపరి విచారణకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో ట్రంప్ చేతులు, కాళ్ళపై వాపు కనిపిస్తోంది. దీంతో వివిధ రకాల ఊహాగాణాలు మొదలయ్యాయి. దీని గురించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ దీర్ఘకాలిక వీనస్ ఇన్సఫిసియెన్సీ అనే సిర వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ఆయన చేతులు, పాదం మెడమ (చీలమండలం) భాగంలో స్వల్ప వాపు వచ్చిందని.. వైద్య పరీక్షలు నిర్వహించగా..
ఉపాధ్యక్ష పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం కొత్త రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ధన్కర్ రాజీనామాపై ఊహాగానాలు మొదలయ్యాయి. తీవ్ర రాజకీయ వాగ్వాదం కూడా జరుగుతోంది.