Hyderabad Fake Honey: తేనె తింటున్నారా అయితే జాగ్రత్త. నగరంలో కల్తీ తేనె తయారు చేస్తూ విక్రయిస్తున్న కేటుగాళ్లు ఎంతోమంది తయారయ్యారు. వాళ్ళనుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా తేనే తయారీ చేస్తూ పట్టుబడ్డారు కేటుగాళ్లు. దీనిలో బెల్లం కలిపి తయారు చేసి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా నగర్ బ్లాక్ వద్ద వంద కిలోల నకిలీ తేనె పట్టుబడింది. బెల్లం కలిపి తేనె తయారుచేసి అమాయకులకు విక్రయిస్తున్న ముగ్గురి నిందితులను కంచన్బాగ్ పోలీసులు తయారుచేసి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితుల వద్ద 100 కిలోల కల్తీ తేనె తోపాటు రెండు కార్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు తేనె వినియోగిస్తున్నప్పుడు దానిని క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేయాలని పోలీసులు సూచించారు.
READ MORE: Off The Record: నకిలీ మద్యం గురించి పర్మిషన్ లేకుండా మాట్లాడవద్దని రూల్..
నకిలీ తేనె గుర్తించడం ఎలా..?
తేనె స్వచ్ఛతను గుర్తించేందుకు శుభ్రమైన గ్లాసులో నీటిని తీసుకోవాలి. అందులో ఒక చుక్క తేనె వేయాలి. అప్పుడు తేనె దిగువన స్థిరపడినట్లయితే, అది స్వచ్ఛమైనది అని అర్థం. అలాకాకుండా, దిగువకు చేరకముందే నీటిలో కరిగితే ఆ తేనె కల్తీది అని గుర్తించాలి. స్వచ్ఛమైన తేనెలో, ఈగ పడిపోవడం వల్ల చిక్కుకుపోదు. తిరిగి ఎగిరిపోతుంది. స్వచ్ఛమైన తేనెను కళ్లకు రాసుకుంటే కొంచెం మంటగా ఉంటుంది. కానీ జిగురు ఉండదు. స్వచ్ఛమైన తేనె వల్ల దుస్తులకు మరక చేయదు. స్వచ్ఛమైన తేనె పారదర్శకంగా ఉంటుంది. గ్లాస్ ప్లేట్‌లో తేనె చుక్కలు వేస్తే, దాని ఆకారం పాములాగా మారితే ఆ తేనె స్వచ్ఛంగా ఉన్నట్లే. తేనెను వేడి చేసి లేదా బెల్లం, నెయ్యి, పంచదార, చక్కెర మిఠాయి, నూనె, మాంసం, చేపలు మొదలైన వాటితో తినకూడదు.
READ MORE: Siddu Jonnalagadda : ఆ హీరోనే నా ఫేవరెట్.. తెలుగు హీరోలకు షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ