MLC Nagababu: జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు రావడంతో పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నీటి మునక ఇష్యూ 20 ఏళ్లుగా ఉందని తెలిపారు. నేటికీ సొల్యూషన్ దొరకలేదన్నారు. ఈ సమస్యపై కౌన్సిల్‌లో మంత్రులను అడిగానన్నారు. రోజుకి 60 వేల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. బస్టాండ్ లో వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. బస్టాండ్ ఎత్తు పెంచాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ అవసరం ఉందని.. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ చేస్తే 25 ప్లాట్ ఫాం నుంచి 45 ప్లాట్ ఫాంలుగా మార్చవచ్చని స్పష్టం చేశారు. ఆర్టీసీకి కమర్షియల్ ఆదాయం వస్తుంది.. శ్రీకాకుళం బస్టాండ్ ఇష్యూపై మంత్రులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం.. దీంతో మరింత రద్దీ పెరిగింది..
రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
READ MORE: KL Rahul కార్ల కలెక్షన్‌లోకి మరో లగ్జరీ కారు.. ఈసారి ఏ కారు కొన్నారంటే? వైరల్ వీడియో..
కాగా.. వర్షం పడితే శ్రీకాకులం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ చెరువును తలపిస్తోంది. ఎక్కడికక్కడ మురుగు నీరు చేరి దుర్వాసన వ్యాపిస్తోంది. ప్రయాణికులు ముక్కు మూసుకుని.. మోకాల్లోతు నీటిలో బస్సు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. బస్టాండ్ నీట మునిగినప్పుడల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు చూసి వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నెల 18న కురిసిన వర్షానికి ఆర్టీసీ కాంప్లెక్స్ పూర్తిగా జలమయం కావడంతో అడుగు పెట్టలేని పరిస్థితి తలెత్తింది. కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈనేపథ్యంలో నాగబాబు పర్యటన ఆసక్తికరంగా మారింది.
READ MORE: Bandla Ganesh : బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్.. ఆ నిర్మాత నుద్దేశించేనా..?