Kadapa's Gandikota Minor Girl Murder: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి పది రోజులు కావస్తున్నా..ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. మైనర్ బాలికను ఆమె ప్రియుడు గండికోట ముఖద్వారం వద్ద వదిలి వెళ్ళిన తరువాత గండికోటలోని మాధవరాయ స్వామి గుడికి వెళుతున్న ఫోటోలు ఇప్పుడు ఎన్టీవీ చేతికి చిక్కాయి..
మాజీ మంత్రి పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వీడియో వైరల్ అవుతోంది. ఈ అంశంపై తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. ఈ నెల 19తేదీన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినట్లు జరిగిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇండిగో విమానంలో వెళ్ళే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా ప్రయాణం చేశారన్నారు.
Son Kills Father in Vikarabad: తండ్రి కనిపించే దేవుడు. పిల్లల్ని చిన్నపటి నుంచి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తాడు. రాత్రింబవళ్లు కష్టపడుతూ.. తన కొడుకుకు మంచి భవిష్యత్తు అందరిచాలనే లక్ష్యంతో కృషి చేస్తాడు. తాను ఎలాంటి బట్టలు వేసుకున్నా పర్వాలేదు.. తన కొడుకు మాత్రం మంచి దుస్తులు ధరించాలని, తన కుమారుడికి సమాజంలో మంచి గుర్తింపు లభించాలని ఆశిస్తుంటాడు. లాంటి గొప్పి తండ్రిని ఓ కొడుకు కడతేర్చాడు. కన్నతండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లి…
ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని అంటున్నారు.. సొంత కుటుంబ సభ్యుల ఫోన్ లే ట్యాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు..
Heavy Rain Alert for Telangana: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని పలు జిల్లాలకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రేపు ఉదయం వరకు తెలంగాణలోని పలు జిల్లాలకు అత్యంత భారీ హెచ్చరికలు జారీ అయ్యాయి.. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది..
వికారాబాద్ జిల్లా దోమ మండలం పీర్లగుట్ట తాండాలో విషాదం నెలకొంది. తనను ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన నేనావత్ లక్ష్మి (19) అనే యువతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుల్కచర్ల మండలం గోన్యా నాయక్ తండాకు చెందిన రాహుల్ తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని...
జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగదీప్ ధన్కడ్ రాజీనామా బాధాకరమన్నారు.
మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా బహిష్కరణ తర్వాత.. బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నిరంతరం పెరుగుతున్నాయి. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దేవాలయాలపై దాడులు సర్వసాధారణంగా మారాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిక్ శక్తులు చైనాతో తమ మైత్రిని పెంచుకుంటున్నాయి. దీంతో భారతదేశ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల బిల్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్య ఉపాధి అంశాలతో పాటు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల రెండు బిల్లులను ఆమోదించడం లేదన్నారు. నేడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవని.. మతాలు ప్రాతిపదిక కాదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్ కు పిలిచి వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కొట్టివేయాలని పోలీసులు కోరారు. ప్రభాకర్ రావు పిటిషన్ ఆగస్టు 4వ తేదీన విచారణకు రానుంది.