AP Private Bus Accidents: ఏపీలో ప్రైవేట్ బస్సు ప్రమాదాలు ఆగడం లేదు. గత15 రోజుల్లో రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏదో బస్సు ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. గతంలో అడపా దడపా ప్రమాదాలకి గురయ్యే ప్రైవేట్ బస్సులు ఇప్పుడు ప్రమాదకరంగా మారిపోయాయి. ఈ బస్సుల్లో ప్రయాణానికి గ్యారెంటీ లేకుండా పోయింది. మొన్న కర్నూలు దగ్గర కావేరి ట్రావెల్స్ 19 మందిని బలి తీసుకుంది. సోమవారం రాత్రి ఏలూరు జిల్లాలో భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చనిపోయారు. హైదరాబాద్ వస్తున్న బస్సు అతివేగం కారణంగానే ప్రమాదానికి గురైంది.
READ MORE: Bus Accidents: నేడు ఒకే రోజు మూడు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు.. పలువురు మృతి..
ఇదిలా ఉండగా.. మంగళవారం తెల్లారుజామున మరో ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం దామరాజు పల్లి దగ్గర జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. ఈ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. కర్నూలు దుర్ఘటన తర్వాత ప్రైవేట్ బస్సుల ఫిట్ నెస్, పర్మిషన్లు తనిఖీ లంటూ హడావిడి చేసిన రవాణా శాఖ అధికారులు మళ్లీ మొదటికి వచ్చారు. కాంట్రాక్టు క్యారేజిలుగా పర్మిట్లు తీసుకుని స్టేజ్ క్యారేజ్ లుగా ప్రైవేట్ బస్సులను తిప్పుతున్నా పట్టించుకోవడం లేదు. డ్రైవర్ల అజాగ్రత్త కారణంగానే ఈ వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రాథమికంగా తేలింది.
READ MORE: Nalgonda: దేవుడా..! మరో రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 45 మంది ప్రయాణికులు..