Telangana MLAs Disqualification Hearings from Nov 6: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగనుంది.. నవంబర్ 6న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెల్లం వెంకట్రావ్, సంజయ్ ల పిటిషన్లను విచారిస్తారు. 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆరికెపూడి గాంధీల పిటిషన్ల విచారణ జరుగుతుంది.. 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్ ల పిటిషన్లపై రెండోసారి విచారణ కొనసాగనుంది.. 13న పోచారం, ఆరికెపూడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ నిర్వహిస్తారు.. రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారించనున్నారు స్వీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..
READ MORE: Cricketers Salary: ఎందుకు ఇంత చిన్న చూపు.. పురుషుల, మహిళల వేతనాలలో ఎంత తేడానో తెలుసా..?
కాగా.. గత నాలుగు రోజుల కిందట తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణకు శాసనసభ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును గడువు కోరింది. గతంలో సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు అక్టోబర్ 31తో పూర్తైంది. దీంతో మరో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని.. అంతర్జాతీయ సదస్సులు ఉండటంతో గడువు సరిపోలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది.
READ MORE: Pakistan: భారత్‌కు వరల్డ్ కప్.. పాకిస్థాన్‌లో కేక్ కట్ చేసి సంబరాలు..(వీడియో)