సెప్టెంబరు 7న చంద్రగ్రహణం రాబోతోంది. భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మనకు విశేషంగా శతభిష నక్షత్రంలో, కుంభ రాశిలో ఏర్పడబోతోంది. చిలకమర్తి పంచాంగ రీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ చంద్ర గ్రహణం రాత్రి 9గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట 26 నిమిషాల వరకు ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అయితే.. చంద్రగ్రహణం రోజు కొన్ని నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
BJP President Race: కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తర్వాత భారతీయ జనతా పార్టీ సారథ్యాన్ని ఎవరు చేపడతారనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థుల పేర్లపై బీజేపీ ఫైనల్ చేయలేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, మరో కేంద్ర మంత్రి కూడా అభ్యర్థుల రేసులోకి ప్రవేశించారని చెబుతున్నారు. అయితే, ఈ అంశంపై బీజేపీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కానీ.. వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా అనేక మంది నాయకుల…
మహారాష్ట్ర షోలాపూర్ నగరంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శిక్షణ కేంద్రంలోని దాదాపు 170 మంది ట్రైనీ పోలీసులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కేంద్రంలో తయారుచేసిన ఆహారం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు. బాధిత ట్రైనీ పోలీసులందరినీ వెంటనే షోలాపూర్‌లోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతోంది. వారిలో దాదాపు 15 మందికి సెలైన్ ఇచ్చి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. 170 మందికి పైగా పోలీసులు అస్వస్థతకు…
ఆన్లైన్ బెట్టింగ్ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి.. ఇల్లీగల్‌గా ఉన్న బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ కొంత మంది మాత్రం అలాంటి నిషేధిత యాప్‌లు నిర్వహిస్తూ.. జనాల వద్ద అందినకాడికి దోచుకుంటున్నారు. అలాంటి 8 మంది ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి.. అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాస్తవానికి.. ఖేల్ గేమ్ , ఖేల్ స్టార్ , ఖేలో 24 , ఖేలో ఎక్చేంజ్, ఖేలో స్పోర్ట్, విన్ మ్యాచ్..…
స్నేహితుని ఆస్తి దక్కించుకోవాలనే దురాశతో అతని కుటుంబాన్ని పాశవికంగా హత్య చేసిన ఘటనలో నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూరులో కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన మేడిద ప్రశాంత్, రాచర్ల పూన ప్రసాద్ స్నేహితులు. ప్రశాంత్ తన అవసరాల కోసం ప్రసాద్ వద్ద రూ. 3.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తర్వాతి కాలంలో ప్రసాద్ ఓ కేసులో ఇరుక్కోగా.. అతను కేసు నుంచి బయటపడేందుకు ప్రశాంత్ సహకరించాడు. ఈ…
తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. సాంకేతికంగా ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా.. వాళ్లను మాత్రం మూఢ నమ్మకాల జాఢ్యం వదలడం లేదు. ఇంకా చేతబడులు, చిల్లంగి, బాణామతి చేస్తున్నారంటూ గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. మానసికంగా భయాందోళన చెందుతూ ఎదుటి వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. తమపై బాణామతి చేస్తున్నారనో.. లేదా తాము బాణామతి బారిన పడ్డామనో.. ఇంకా కొంత మంది జనాలు గుడ్డిగా నమ్ముతున్నారు. చేతబడి గురించి భయపడుతూ మానసిక […]
GST Council: దీపావళి పండగ సమీపిస్తున్న వేళ వినియోగదారులకు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిన్న(సెప్టెంబర్ 3న) జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్‌లు (5, 18 శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతోన్న 12, 28శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించారు. ఇప్పుడు వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా […]
GST Council: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తొలిరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్‌లు (5, 18 శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతోన్న 12, 28శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించారు. ఇప్పుడు వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీటిపై 18% జీఎస్టీ ఉండేది. దీంతో సామాన్యులకు ఉపశమనం…
GST Council Simplifies Tax Slabs: భారతదేశ పరోక్ష పన్ను నిర్మాణంలో కొన్ని ప్రధాన మార్పులను జీఎస్టీ కౌన్సిల్ బుధవారం ఆమోదించింది. ఇప్పుడు వస్తువులపై 5%, 18% స్లాబులు మాత్రమే విధిస్తారు. ఈ నిర్ణయం సామాన్యులకు వరంగా మారనుంది. అనేక రోజువారీ వస్తువులు సెప్టెంబర్ 22 నుంచి చౌకగా మారనున్నాయి. కిరాణా వస్తువులు, ఎరువులు, చెప్పులు, బట్టలు, పునరుత్పాదక శక్తి వంటివి తక్కువ ధరకు లభిస్తాయి. గతంలో ఉన్న 12%, 28% పన్నులు విధించిన వస్తువులు 5%, […]
వినాయక చతుర్థి వచ్చేసింది. భక్తులంతా వినాయకుని ప్రతిమలను మండపాల్లో పెట్టి కొలుస్తున్నారు. అయితే.. మనమంతా పెట్టుకునే ఈ గణేశుడి విగ్రహాల ఖర్చు, రంగు, రూపం భిన్నంగా ఉండాలని అందరూ అనుకుంటారు. వారి అభిరుచులకు అనుగుణంగా విగ్రహాలను తయారు చేయించుకుంటారు. చాలా రకాల వినాయకుడి ప్రతిమలు చూసే ఉంటారు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే 5 స్టార్ చాక్లెట్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా? చూడలేదా.. అలాగైతే.. ఏపీలోని అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. READ MORE: […]