CV Anand: దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారని ఆనంద్ తెలిపారు. Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందనలు తెలిపారు.. జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుందని పేర్కొన్నారు… DCP కవిత, CP సజ్జనార్ కు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
READ MORE: Man Escapes Death: ఇతడికి ఇంకా భూమ్మీద నూకలున్నాయి.. పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు..
” “దమ్ముంటే నన్ను పట్టుకోండి” అని పోలీసులనే సవాలు చేస్తూ బెదిరించిన వ్యక్తిని చివరకు అరెస్ట్ చేసినందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత మరియు టీమ్ కి నా అభినందనలు. ఈ సందర్భంగా హెచ్‌డీ మూవీ పైరసీ కేస్ ప్రెస్ మీట్ వివరాలు మళ్లీ రీపోస్ట్ చేస్తున్నాను. హ్యాకర్లు డిజిటల్ కంపెనీస్ సర్వర్లు హ్యాక్ చేసి సినిమా విడుదలకు ముందే ఒరిజినల్ కాపీలను తమ వెబ్‌సైట్లలో విడుదల చెయ్యటం వలన సినిమా పరిశ్రమకు భారీ నష్టాలు వచ్చాయి. జూన్ 5 నుంచి రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన సైబర్ క్రైమ్ టీమ్ ఈ పైరసీ రాకెట్లో ఉన్న కీలక నిందితులందరినీ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు విదేశాల్లో ఉన్న రవిని తప్ప. హైదరాబాద్ సిటీ పోలీస్, సీపీ సజ్జనార్, DCP సైబర్ క్రైమ్స్ కి నా అభినందనలు.” అని సీవీ ఆనంద్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
“దమ్ముంటే నన్ను పట్టుకోండి” అని పోలీసులనే సవాలు చేస్తూ బెదిరించిన వ్యక్తిని చివరకు అరెస్ట్ చేసినందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత మరియు టీమ్ కి నా అభినందనలు. ఈ సందర్భంగా హెచ్‌డీ మూవీ పైరసీ కేస్ ప్రెస్ మీట్ వివరాలు మళ్లీ రీపోస్ట్ చేస్తున్నాను. హ్యాకర్లు డిజిటల్…
— CV Anand IPS (@CVAnandIPS) November 15, 2025